Sunday, May 19, 2024
- Advertisement -

టీటీడీ ప్ర‌ధాన అర్చ‌కుల రిటైర్‌మెంట్‌పై సంచ‌లన ట్వీట్ చేసిన జ‌గ‌న్‌..

- Advertisement -

టీటీడీలో ప్ర‌దాన అర్చ‌కుల రిటైర్‌మెంట్‌పై దుమారం చెల‌రేగుతోంది. కొత్త‌గా ఏర్పాటైన పాల‌క మండ‌లి అర్చ‌కుల రైటైర్‌మెంట్‌ను 65 సంత్స‌రాలుగా నిర్ణ‌యం తీసుకోవ‌డంతో వివాదాస్ప‌దం అయ్యింది. దీనిపై వైఎస్ జ‌గ‌న్ స్పందించారు.

టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలను ప్రశ్నించినందుకు అర్చకులపై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డి వారి ప‌ద‌వీ విర‌య‌ణపై నిర్ణ‌యంతీసుకోవడాన్ని త‌ప్పుప‌ట్టారు జ‌గ‌న్‌. టీడీపీ హయాంలో అన్యాయానికి గురవుతున్న అర్చకులకు ఆయన మద్దతుగా నిలిచారు. తాము అధికారంలోకొస్తే అర్చకులకు రిటైర్మెంట్ లాంటివి లేకుండా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు పలు అంశాలు ప్రస్తావిస్తూ జననేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

టీటీడీ ప్రధాన అర్చకుడు తెలిపిన విషయాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార దాహం మరోసారి వెల్లడైందని ఆరోపించారు. పదోన్నతితో పే స్కేలు, పదవి వదిలిపెట్టిన తరువాత ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వనప్పుడు, ఉద్యోగిగా పరిగణించనప్పుడు, వారికి ప్రభుత్వం రిటైర్మెంట్ ప్రకటించడంలో అర్థం లేదని జగన్‌ ట్వీట్‌ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -