Monday, May 20, 2024
- Advertisement -

2019 లో జగన్ సీఎం అవ్వాలి అంటే ఏం చెయ్యాలి ?

- Advertisement -
ys jagan fail to protest chandrababu government promises

జగన్ మోహన్ రెడ్డి .. ఆంధ్ర ప్రదేశ్ కి ప్రతిపక్ష నాయకుడిగా తనదైన శైలి లో దూసుకుపోతున్న జగన్ సరైన రీతిలో , సరైన ప్రయత్నంలో వెళుతున్నాడా అనే సందేహం చాలా మందికి ఉంది. తన తండ్రి చనిపోయిన తరవాత ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నాలు చేసి విఫలం అయ్యి సాక్షాత్తూ సోనియా గాంధీ నే ఎదిరించిన ఘనత వై ఎస్ జగన్ కి ఉంది. అప్పట్లో విపరీతమైన దూకుడు స్వభావం , మొండి ధైర్యం ఆత్మవిశ్వాసం ఇవన్నీ మెండుగా ఉండే జగన్ చాలా స్ట్రాంగ్ గా వైకాపా ని మొదలు పెట్టాడు.

ఆ తరవాత కాలం లో మాత్రం కేసుల ఎఫ్ఫెక్ట్ ఆయన మీద గట్టిగానే పడింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా సోనియా గాంధీ మీద నెగెటివ్ కామెంట్ లు చెయ్యలేదు జగన్. ఆ రేంజ్ లో సైలెంట్ అయిపోయిన జగన్ మోహన్ రెడ్డి 2014 లో అధికార పీఠాన్ని జస్ట్ మిస్ అయ్యారు. కేసుల నుంచి బయటపడలేక పోయినా జైలు నుంచి బెయిలు మీద బయటకి వచ్చిన జగన్ జనాదరణ ఎక్కడా తగ్గలేదు అని నిరూపించుకున్నాడు. కేసుల వ్యవహారం జగన్ కి జనాదరణ తగ్గించలేదు కానీ ఖచ్చితంగా ఆయన కాన్ఫిడెన్స్ మీద దేబ్బెసింది అని చెప్పచ్చు. మానుకోట సంఘటనతో మళ్ళీ తెలంగాణాలో అడుగుపెట్టే ధైర్యం చేయలేకపోయాడు. కెసీఆర్‌తో సంధి చేసుకున్నాడన్న మాట వాస్తవం. కడప పౌరుషానికి-ఢిల్లీ విలన్స్‌కి మధ్య పోరు అని చెప్పి మొదట్లో సోనియా గాంధీపైన కూడా ఘాలు విమర్శలు చేసిన జగన్…కోర్టు కేసుల దెబ్బ పడిన తర్వాత మాత్రం సోనియాను విమర్శించే ధైర్యం చేయలేకపోతున్నాడు.

అలాగే నరేంద్రమోడీతో కూడా ఈ యువనేతకు రహస్య ఒప్పందాలేవో ఉన్నట్టే ఉన్నాయి.అసెంబ్లీలో భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు, ప్రజాక్షేత్రంలో కూడా అధికార పార్టీతో ఇంచుమించుగా సరిసమానమైన ఓట్ల శాతం ఉన్న ఒక ప్రతిపక్షనేతకు ఇంతకు మించిన అవకాశాలు ఏవీ ఉండవు. ప్రతిపక్షం అంత బలంగా ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేయాలంటే అధికార పార్టీ నేతలు భయపడాల్సిన పరిస్థితులు ఉండాలి. ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకోవాలన్నా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. కానీ అటు ప్రధాని నరేంద్రమోడీ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ జగన్‌ని కనీసం కేర్ చేసే పరిస్థితులు కూడా లేవు. నరేంద్రమోడీని విమర్శించే దమ్ము వైఎస్ జగన్‌కి ఎలాగూ లేదు. కానీ చంద్రబాబును కూడా భయపెట్టలేకపోతున్నాడు జగన్. 144 సెక్షన్ విధించి మరీ ప్రజల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నా, రుణమాఫీ పేరు చెప్పి రైతులను, మహిళలను మోసం చేసినా జగన్ చేయగలిగింది ఏమీ లేదు. అదేంటంటే చంద్రబాబుకు మీడియా బలం ఉంది, మోడీ, కేసీఆర్ కాళ్ళు పట్టుకుని మేనేజ్ చేసుకుంటున్నాడు, సిసలైన హీరో మా జగనే అని మాత్రం వైసీపీ నేతలు కహానీలు చెప్తూ ఉంటారు. జగన్ తన దూకుద్ స్వభావం మళ్ళీ మొదలు పెట్టాలి అనీ ధైర్యంగా ఎవ్వరినీ లెక్కజేయకుండా కేసుల గురించి పక్కన పెట్టి గట్టిగా పోరాడితే 2019 లో అధికారం దక్కించుకునే ఛాన్స్ తప్పకుండా ఉంది అని విశ్లేషకులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -