Saturday, May 18, 2024
- Advertisement -

ప్ర‌పంచంలోనే శ‌తాధిక వృద్దుడు ఈ జ‌పాన్ తాత‌

- Advertisement -

ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన వృద్ధునిగా జపాన్‌కు చెందిన మసాజో నొనాక ఎంపికయ్యారు. ఆయన వయస్సు 112 ఏండ్లు. ఈ మేరకు మంగళవారం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు జపాన్ హొక్కయిడో ద్వీపంలోని ఆయన నివాసం వద్ద ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. జూలై 25, 1905న జపాన్‌లోని హొక్కాయ్‌డోలో జన్మించిన మసాజో నూటపన్నెండేళ్ల వయస్సులో ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించారు.

ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మసాజో ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి కొద్దిరోజుల ముందు 1905 జూలై 25న నొనాక జన్మించారు. స్వీట్లు, వేడినీటి స్నానాల వల్లే ఆయన ఎక్కువ కాలం జీవిస్తున్నారని.. అదే ఆయన జీవిత విజయ రహస్యమని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మసాజో నొనాక కుటుంబ సభ్యులు ఓ హాట్ స్ప్రింగ్ హోటల్‌ను నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం వీల్‌చైర్‌కు పరిమితమైనప్పటికి ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పులు రాలేదని, ప్రతి రోజూ దినపత్రిక చదువుతారని వెల్లడించారు. స్పెయిన్‌కు చెందిన ఫ్రాన్సిస్కో న్యూజెన్‌ ఒలివెరా పేరు మీద ఉన్న ప్రపంచరికార్డు ఆయన మరణానంతరం మసాజోకు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -