Saturday, May 18, 2024
- Advertisement -

రుణమాఫీపై తొలి సంతకం

- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రిగా కుమారి జయలలిత పదవీ ప్రమాణం చేశారు. అనంతరం  రైతుల రుణ మాఫీ ఫైలుపై తొలి సంతకం చేశారు. పలు కొత్త పథకాలను ప్రకటిస్తూ తమిళ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. జయలలితతో పాటు 28 మంది ఎమ్మెల్యేలు మంత్రులాగా ప్రమాణం చేయడం విశేషం.

వీరిలో తమిళనాడు ముఖ్యమంత్రిగా కొన్నాళ్లు పనిచేసిన పన్నీర్ సెల్వం కూడా ఉన్నారు. గతంలో చేసినట్టుగానే మంత్రులంతా ఒకేసారి సామూహికంగా ప్రమాణం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట అల్పాహారం, మద్యం దుకాణాల సమయం తగ్గించడం, చేనేత కార్మికులకు 700 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా వంటి పథకాలను ప్రకటించారు. అలాగే రాష్ట్రమంతా వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ను కూడా సిఎం జయలలిత ప్రకటించారు. ఈ కొత్త పథకాలన్నీ జూన్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయి. రాష్ట్రంలో ఐదు వందల మద్యం దుకాణాల మూసివేతకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.

మద్యం దుకాణాలు గతంలో ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ తెరిచి ఉంచేవారు. సవరించిన సమయాల్లో భాగంగా మద్యం దుకాణాలు మధ్యాహ్నం 12 గంటలకు తెరచి రాత్రి 10 గంటలకు మూసివేయాలని సిఎం ఆదేశించారు. ఈ పథకాలన్నీ ఈ ఎన్నికల సమయంలో జయలలిత ప్రజలకు ఇచ్చిన హామీలే కావడం గమనార్హం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -