Monday, April 29, 2024
- Advertisement -

తెరపైకి తమిళ రాజకీయాలు..

- Advertisement -

దేశ రాజకీయాల్లో తమిళ రాజకీయాలు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగానే నిలుస్తూ ఉంటాయి. అక్కడి ప్రజల్లో స్వభాషా అభిమానం చాలా ఎక్కువ దాంతో అక్కడ జాతీయ పార్టీల కన్నా ప్రాంతీయ పార్టీలే ప్రాతినిథ్యం వహిస్తూ ఉంటాయి. అక్కడ ఎన్ని పార్టీలు ఉన్నప్పటికి డీఎంకే, అన్నా డీఎంకే వంటి రెండు పార్టీలు మాత్రమే చక్రం తిప్పుతున్నాయి. స్టాలిన్ సారథ్యంలో డీఎంకే పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండగా, జయలలిత మరణం తరువాత అన్నా డీఎంకే పార్టీ హవా తగ్గిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం అన్నా డీఎంకే పార్టీలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి.. తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. ఒకానొకప్పుడు ఎమ్జీఆర్, జయలలిత వంటి బలమైన నేతలు అన్నా డీఎంకే పార్టీని తమిళనాట తిరుగులేని శక్తిగా మార్చారు. ముఖ్యంగా జయలలిత మరణం తరువాత ఏడీఎంకే పార్టీ స్థితిగతులే మారిపోయాయని చెప్పవచ్చు. .

జయలలిత తరువాత చిన్నమ్మగా పిలువబడే శశికళ జైలుపాలు కావడంతో పార్టీ ఆధిపత్యం కోసం కుమ్ములాటలు విపరీతంగా పెరిగిపోయాయి. మరి ముఖ్యంగా జయలలిత కు నమ్మిన బంటు అయిన పన్నీరు సెల్వం, అలాగే చిన్నమ్మ శశికళ అనుచరుడు అయిన పళని స్వామి మద్య పార్టీ ఆధిపత్య పోరు తార స్థాయికి చేరింది. పార్టీకి ఒకరే నాయకత్వం వహించాలని అటు పన్నీరు సెల్వం, ఇటు పళని స్వామి గత కొన్ని రోజులుగా పోటీ పడుతూనే ఉన్నారు. ఈ పోటీ ప్రస్తుతం వీధుల్లో చేరి ఇరు వర్గాలు ఘర్షణలు చేసుకునే వరకు వచ్చింది. ఈ ఘర్షణల మద్య జూన్ 23న ఏడీఎంకే జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు పళని స్వామి వర్గం ప్రకటించింది. దాంతో ఈ సమావేశం ఆపాలంటూ పన్నీరు సెల్వం వర్గం మద్రాస్ హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. కానీ కోర్టు ఆ పిటిషన్ ను అంగీకరించలేదు ఇక పార్టీ సమావేశంలో ఏక నాయకత్వంపై తీర్మానం కూడా జరిగింది.

ఈ తీర్మానంలో పళని స్వామి వైపు ఎక్కువ మొగ్గు చూపారు. దాంతో పన్నీరు సెల్వం తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జులై 11 న జరిగిన రెండవ జనరల్ సమావేశాలను అడ్డుకునేందుకు పన్నీరు సెల్వం తన అనుచరులతో చెన్నై లోని పార్టీ కార్యలయం వద్దకు వచ్చారు. అప్పటికే పళని స్వామి వర్గం అక్కడే ఉండడంతో ఇరువర్గాలు రాళ్ళు రువ్వుకుంటూ ఘర్షణలకు పాల్పడ్డారు. ఇక ఈ ఆధిపత్య పోరులో ఏడీఎంకే పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రెటరీ గా పళని స్వామి ఎన్నుకోబడ్డారు. ఇది పార్టీలో బలమైన పోస్ట్ కావడంతో రాబోయే రోజుల్లో అన్నాడీఎంకే పార్టీ అధ్యక్ష పదవిలో కూడా పళని స్వామి ఉండే అవకాశం ఉంది. మరి పన్నీరు సెల్వం తరువాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేది ప్రస్తుతం తమిళనాట ఆసక్తికరంగా మారింది.

Also Read

టాప్ లో భారత్.. ప్రమాదం తప్పదా ?

ముందస్తు సమరానికి సిద్దం ?

రెండవసారి.. నో చెప్పిన వెంకయ్య ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -