Tuesday, April 30, 2024
- Advertisement -

లిక్కర్ స్కాం..కవిత అరెస్ట్ ఖాయమా?

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం సెగలు తెలుగు రాష్ట్రాలకు పాకిన సంగతి తెలిసిందే. ప్రధానంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పేరు ఇందులో ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ కేసులో పలుమార్లు ఆమెను ఈడీ అధికారులు విచారించారు. ఈ క్రమంలో ఆమె అరెస్ట్ అవుతుందని భావించినా అది జరగలేదు. అయితే తాజాగా ఇప్పుడు కవిత అరెస్ట్‌ గురించిన టాక్ నడుస్తోంది.

ఢిల్లీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే కవిత అరెస్ట్ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కవితను నవంబర్ 20 వరకు అరెస్ట్ చేయవద్దని సుప్రీం సూచించిన నేపథ్యంలో ఈ గడువు ముగిసిన వెంటనే ఆమెను అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.

ఇక నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా పీక్ టైంలో కవితను అరెస్ట్ చేస్తారని ప్రచారం జోరందుకుంది. అయితే కవిత అరెస్ట్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ మాత్రం కవిత అరెస్ట్‌తో అవినీతికి పాల్పడిని ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమనే సంకేతాన్ని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక కవిత తర్వాత ఈడీ టార్గెట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఉండనున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఎన్నికల వేళ కవిత అరెస్ట్ ఎవరికి కలిసి వస్తుందో వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -