Wednesday, May 8, 2024
- Advertisement -

ఢిల్లీ మద్యం కుంభకోణం ఏమిటి..?? మద్యం పాలసీలో తేడా ఏమిటి..??

- Advertisement -

గత కొద్ది రోజులుగా దేశాన్ని కుదిపెస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం. భారీ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగిందని సీబీఐ, ఈడీ కేసులు పెట్టాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ బడా బడా రాజకీయ నాయకుల అరెస్టులు చేసిన విషయం తేలిసింది. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ రోజు విచారణ ఎదుర్కోనుంది. మరో పక్క కవిత కచ్చితంగా జైలుకు వెళ్ళడం ఖాయమని వార్తలు జోరందుకున్నాయి.

ఇంతకి ఢిల్లీ మద్యం కుంభకోణం ఏమిటి..?? పాత మద్యం పాలసీ ఏమిటి..? కొత్త మద్యం పాలసీ ఏమిటి..? మద్యం పాలసీ మార్పుతో కుంభకోణం ఎలా జరిగింది…?

ఢిల్లీ పాత మద్యం పాలసీ

750ML టోకు ధర ₹166.73
ఎక్సైజ్ డ్యూటీ ₹223.88
VAT ₹106.00
రిటైలర్ కమీషన్ ₹ 33.39
MRP ₹530.00

కొత్త మద్యం పాలసీ: (మార్చి 2022లో అమలు చేశారు)

750ML టోకు ధర ₹188.41
ఎక్సైజ్ డ్యూటీ ₹ 1.88
VAT 1% ₹ 1.90
రిటైలర్ మార్జిన్ ₹ 363.27
అదనపు ఎక్సైజ్ ₹ 4.54
MRP ₹560.00

ఇలా పాత మద్యం పాలసీలో ఒక సీసాపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 329.89, కొత్త మద్యం పాలసీలో 8.32 మాత్రమే. అంటే, కొత్త పాలసీ వల్ల ప్రభుత్వానికి ఒక్కో సీసా ₹ 321.57 నష్టం. పాత పాలసీలో రిటైలర్ కమీషన్ 33.39 అయితే కొత్త పాలసీలో రిటైలర్ కమీషన్ కొన్ని నెలలకు రూ. 363.27, అంటే రిటైలర్‌కు ఒక్కో బాటిల్‌కు ₹ 330.12 లాభం. ఒక్కో బాటిల్‌కు ప్రభుత్వం ఎంత నష్టపోతుందో, రిటైలర్‌కు ప్రయోజనం చేకూర్చినట్లు స్పష్టమవుతోంది. కొత్త పాలసీని రూపొందించడం ద్వారా తయారీదారులు/చిల్లర వ్యాపారులకు ఎంత ప్రయోజనం చేకూరిందో….?

అమ్మకాల గణాంకాలు: పాత పాలసీలో నెలకు 132 లక్షల లీటర్ల మద్యం అమ్మకాలు జరుగుతుండగా, కొత్త పాలసీలో నెలకు 245 లక్షల లీటర్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. సేల్‌ను పెంచడానికి తాగే వయస్సు 18 సంవత్సరాలకు తగ్గించబడింది మరియు ఉదయం 3 గంటల వరకు సమయం పెంచబడింది. డ్రైడేస్‌ను 31 నుండి 3 రోజులకు తగ్గించారు. తద్వారా మద్యపానం గరిష్టంగా పెరుగుతుంది, ఏరులై పారుతుంది, పేదవారి జీవితాలు అల్లకల్లోలమౌతున్నాయి.

-Ramesh Reddy Chilakala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -