Tuesday, May 21, 2024
- Advertisement -

ప్రభుత్వంపై మళ్లీ ఫైర్

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వంపై రెండు రోజుల క్రితం విరుచుకుపడిన ప్రొఫెసర్ కోదండ రామ్ మళ్లీ మరోసారి అదే ధోరణిని వ్యక్తం చేశారు. అంతేకాదు.. తాను మారనని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రజల కోసం తాను ,చేస్తున్న పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని అన్నారు. ఇప్పటికే తన జీవితంలో మూడు వంతులు ముగిసిపోయిందని, మిగిలిన ఒక వంతు కోసం తాను ఎవరితో రాజీ పడనని అన్నారు.

తెలంగాణ కోసం కొట్లాడినట్టుగానే ఇప్పుడు తెలంగాణ సంపూర్ణ అభివ్రద్ధి కోసం పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. నేడు హైదరాబాద్ జెఎసి సమావేశం ఏర్పాటు చేసిన కోదండరామ్ భవిష్యత్ ఉద్యమాలపై అక్కడ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రెండేళ్ల తెలంగాణ అభివ్రద్ధి, ప్రభుత్వ తీరుతెన్నులు అనే అంశంపై మంచిర్యాలలో జరిగిన సదస్సులో కోదండరామ్ మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా సంఘాల పాత్ర ఎంతో ఉంటుందని, ఆనాడు తాము అదే పని చేశామని, నేడు అదే పని చేయనున్నామని ఆయన స్పష్టం చేశారు.

ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన వారికి ప్రజల సంక్షేమం కోసం పోరాడే హక్కులేదా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి విడిడివిగా కోదండరామ్ వ్యాఖ్యలను ఖండించారు. నిజానికి కోదండరామ్ ను జెఎసి చైర్మన్ చేసింది కెసిఆరేనని ఉపముఖ్యమంత్రి మహమూద్ ఆలీ అన్నారు. కెోదండరామ్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని, ఆయన అలా ఎందుకు మారారో తెలియడం లేదని హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి అన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -