Sunday, May 19, 2024
- Advertisement -

అడ్డంగా ఇరుక్కున్న స్పీకర్

- Advertisement -

లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వివాదంలో చిక్కుకున్నారు. భద్రతా  కారణాలు చూపెడుతూ అధికార వాహనం కోసం రూ 48.25 లక్షలు వెచ్చించి కారు కొనుగోలు చేయడంపై దుమారం రేగుతోంది. అధికా ప్రతిపక్షాలు ఈ చర్యపై పరస్పరం విమర్శల పర్వం మొదలుపెట్టాయి.

స్పీకర్ కాన్వాయ్ లో భాగంగా ఇటీవల రూ.48లక్షలతో జాగ్వర్ కొనుగోలు చేశారు. ఈ వాహనం అందరి దృష్టిని ఆకర్షించిన క్రమంలో  లగ్జరీ వాహనం వాడటంపై నరాలోచించాలని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ స్పీకర్ కు సూచించింది. దేశంలో మూడింట ఒక వంతు ప్రజలు కరువుతో సతమతమవుతున్న క్రమంలో రూ.48లక్షల లగ్జరీ వాహనం వినియోగించడం సరైనదేనా అని స్పీకర్ ఆలోచించుకోగలరనే తాము భావిస్తున్నట్లు ఆ పార్టీ వ్యాఖ్యానించింది. సీనియర్ పార్లమెంటరీ నేతగా పేరున్న సుమిత్ర మహాజన్ కు దేశ పరిస్థితులపై – ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలపై స్పష్టత ఉందని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ వివాదంపై లోక్ సభ సచివాలయం స్పందించింది.

భద్రతా కారణాలతోనే ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్టు లోక్ సభ సెక్రటేరియట్ కార్యదర్శి భల్లా చెప్పారు. తాము పరిశీలించిన వాహనాల్లో ఇదే చౌకగా లభించిన వాహనమని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన సమాచారం పూర్తి పారదర్శకంగా ఉంచామని భద్రతా కారణాలతోనే లోక్ సభ సెక్రటేరియట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -