Wednesday, April 24, 2024
- Advertisement -

ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు మ‌రో ఎదురుదెబ్బ‌

- Advertisement -

ఐపీఎస్ ఆఫీస‌ర్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు మరోసారి ఎదురుదెబ్బ త‌గిలింది. తనకు మద్దతు తెలపాలన్న ఆయ‌న విజ్ఞప్తికి ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్ నుంచి సానుకూల స్పంద‌న ల‌భించ‌లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏబీవీ విచారణను ఎదుర్కోక‌ తప్పదని అసోసియేష‌న్ స్పష్టంగా చెప్పింది. అస‌లేం జరిగిందంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ప‌నిచేసిన‌పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసింది.

దీంతో ఆయన హైకోర్టుకు వెళ్ల‌గా.. సస్పెన్షన్‌పై గతంలో స్టే ఇచ్చిన న్యాయ‌స్థానం… డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో ఏబీవీని సస్పెండ్‌ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో(క్యాట్‌) ఇదివరకే స్పష్టం చేసింది. అంతేగాక‌.. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన వేసిన‌ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును ఇవ్వగా.. దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

ఈ క్ర‌మంలో ఏబీవీ సస్పెన్షన్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఆయ‌న‌కు నిరాశ ఎదురైంది. ఇలా వ‌రుస షాకులు త‌గ‌ల‌డంతో.. ప్ర‌భుత్వం క‌క్ష‌గ‌ట్టి త‌న‌ను వేధిస్తోంద‌ని, త‌న‌కు అండ‌గా ఉండాల‌ని ఏబీవీ ఐపీఎస్ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌కు లేఖ రాశారు. ఈ విష‌యంపై చ‌ర్చించిన అసోసియేష‌న్‌.. ప్రభుత్వం సస్పెన్ష‌న్‌‌ విధించడం సరైందే అని పేర్కొంటూ.. తాము ఈ అంశంలో జోక్యం చేసుకోలేమ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో ఐపీఎస్‌ల‌పై ఆరోప‌ణ‌లు చేస్తే ఉపేక్షించ‌బోమ‌ని ఏబీవీకి వార్నింగ్ ఇచ్చింది.

అమెరికాలో ఉద్యోగాల గోల.. కనిపిస్తే ఏరివేత..!

ఊహాగానాలకు తెర దించిన బ్రిటన్​ రాణి ఎలిజబెత్..!

పాకిస్థాన్ కి పవర్ కష్టాలు.. రాత్రంతా కరెంట్ లేకుండానే..!

చైనా సైనికుడు భారత భూభాగంలోకి ఎంట్రీ.. పట్టుకున్న బలగాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -