Saturday, April 27, 2024
- Advertisement -

జమ్ము కాశ్మీర్ కి కేంద్రమే నియామకాలు..!

- Advertisement -

జమ్ముకశ్మీర్​కు చెందిన అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్​, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను ఇక కేంద్రమే నేరుగా నియమించనుంది. ఇకపై వీరంతా అరుణాచల్​ ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాల (ఆగ్ముత్​) కేడర్​​లోకి వస్తారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.

జమ్ముకశ్మీర్ విభజనకు ముందు అక్కడ పనిచేస్తోన్న అధికారులు అరుణాచల్​ ప్రదేశ్​, గోవా, మిజోరం, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోస్టింగులు పొందుతారు.

ఆగ్ముత్​ కేడర్​కి కేటాయించిన అధికారులు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తారని నోటిఫికేషన్‌ పేర్కొంది. అవసరమైతే సంబంధిత కేడర్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయవచ్చు.జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా, ఆర్టికల్ 370 రద్దు చేసిన ఏడాది తరువాత ఈ ప్రకటన రావడం గమనార్హం.

జగన్ లేఖ.. కదిలిన సుప్రీం కోర్టు పీఠం..!

అలాంటి వారికి పోటీ చేసే అర్హత లేదు.. సుప్రీం కోర్టు షాక్..!

బదాయూ నిందితుడిని అర్ధరాత్రి పట్టేసిన యూపీ పోలీసులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -