Sunday, May 19, 2024
- Advertisement -

మ‌న‌శ్శాంతి క‌రువైంద‌ని స‌న్యాసి ఆత్మ‌హ‌త్య‌

- Advertisement -
  • ఇక సాధార‌ణ ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంటో?

సాధార‌ణ జీవికి క‌ష్ట‌మొస్తే అవ‌న్నీ భ‌రించ‌లేక సంసార బాధ‌లు, ఉద్యోగాలు అన్నీ వ‌దిలి స‌న్యాసం తీసుకుంటారు. స‌న్యాసంతో ప్ర‌శాంతంగా ఉంటుంద‌ని భావించి అటువైపు వెళ్లిపోతారు. జోలె చంక‌న వేస్కొని.. లోక‌మంతా తిరుగుతూ హాయిగా.. స్వేచ్ఛ‌గా సంచ‌రిస్తుంటారు. అందుకే అంద‌రూ క‌ష్టాలు ఎక్కువ‌గా వ‌స్తే దీనిక‌న్నా స‌న్యాసి జీవితం బెట‌ర్ అని అంటారు. అలాంటిదే స‌న్యాసికి క‌ష్ట‌మొచ్చింది. మ‌న‌శ్శాంతికి ఆల‌వాల‌మైన స‌న్యాసికి అదే క‌రువైందంట‌. మ‌న‌శ్శాంతి లేద‌ని ఓ స‌న్యాసి ఏకంగా ఆత్మ‌హ‌త్య చోటుచేసుకున్న సంఘ‌ట‌న క‌ర్నాట‌క‌లో జ‌రిగింది.

క‌ర్నాట‌క‌న హవేరీ తాలూకాలోని హుల్లత్తి గ్రామ దింగాలేశ్వర శాఖ మఠంలో మహాలింగ స్వామిజీ (38) ఉంటున్నాడు. మ‌న‌శ్శాంతి క‌రువైందని లేఖ రాసి ఆదివారం (జ‌న‌వ‌రి 7వ తేదీ) ఆత్మహత్య చేసున్నాడు. సోమవారం తెల్లవారుజామున మఠంలో భక్తులు ఈ విషయాన్ని గ‌మ‌నించి హానగల్ పోలీసులకు తెలిపారు. ఆత్మ‌హ‌త్య లేఖ‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఆత్మ‌హ‌త్య లేఖ‌లో తన మరణానికి ఎవరూ కారణం కాదని, కొంతకాలంగా మనశ్శాంతి లేక‌పోవ‌డంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్ర‌క‌టించాడు. తనను అదే మఠంలో సమాధి చేయాలని కోరాడు. ఈయ‌న గ‌తంలో మహాలింగ స్వామిజీ క‌ర్నాట‌క గదగ జిల్లా శిరహట్టి తాలూకాలోని బాలేహోసురుకు చెందిన దింగాలేశ్వర మఠంలో ఉండేవాడు. కొన్నాళ్ల‌కు దింగాలేశ్వర శాఖకు వచ్చారు. సాధార‌ణ ప్ర‌జ‌లు మ‌న‌శ్శాంతి కోసం ఆల‌యాలు, మ‌ఠాల‌కు వెళ్తుంటారు. అలాంటిది మ‌ఠంలో ఉన్న స‌న్యాసే ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ఆశ్చ‌ర్యమేస్తోంది.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -