Saturday, May 18, 2024
- Advertisement -

సమయం గడుస్తున్నా ముందుకు రాని సర్కార్

- Advertisement -

కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగింపునకు వచ్చింది. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడం లేదు. దీంతో గురువారం నుంచి ముద్రగడ పద్మనాభం చేపడతానన్న నిరాహారదీక్ష ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

తుని ఘటనకు బాధ్యులను చేస్తూ అరెస్టు చేసిన వారిని వదిలిపెట్టాలని, లేకపోతే గురువారం నుంచి తాను నిరాహారదీక్ష చేస్తానని ముద్రగడ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం నాడు సమయం గడుస్తున్నా ఎపి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానరాలేదు.

అంతే కాదు  ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాజమండ్రిలో మాట్లాడుతూ ముద్రగడ డిమాండ్లను పరిగణించడం లేదని అన్నారు. అంతే కాదు అరెస్టు చేసిన వారిని వదిలేదని కూడా ప్రకటించారు. ఇది కూడా ఒక విధంగా ముద్రగడ పద్మనాభం దీక్షకు పురిగొల్పుతున్నాట్లుగా ఉంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -