Sunday, May 19, 2024
- Advertisement -

సూర్యుని సమీపంలోకి మీ పేరును పంపించుకునేందుకు…నాసా బంఫ‌ర్ ఆఫర్

- Advertisement -

సూర్యునిద‌గ్గ‌ర‌కు పేర్ల‌ను పంపించ‌డం ఏంటి అనుకుంటున్నారా…? న‌మ్మ‌శ‌క్యం కాకుండా ఉందా…? మీరు వింటున్న‌ది నిజ‌మే. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆఫర్ ఇచ్చింది. సూర్యుని వాతావరణంలో మీ పేరు ప్రయాణించాలని కోరుకునే వారు తమ పేర్లను తెలియజేయాలని సూచించింది.

పేర్ల‌ను పంపించుకొనేందుకు ఏప్రిల్ 27 వరకు ఈ అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో నాసా వెబ్ సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు తమ పేరును న‌మోదు చేసుకోవ‌చ్చును. ఇలా ఆసక్తి వ్యక్తీకరించిన వారి పేర్లన్నింటినీ ఓ మైక్రో చిప్ లో పొందుపరిచి దాన్ని ఈ వేసవిలో ప్రయోగించే రాకెట్ లో ఉంచనుంది.

నాసా సూర్యుని చుట్టూ వాతావరణంపై అధ్యయనానికి గాను పార్కర్ సోలార్ ప్రోబ్ పేరుతో ప్రాజెక్టు చేపట్టింది. ఓ కారు పరిమాణంలో ఉండే స్పేస్ క్రాఫ్ట్ ను నేరుగా సూర్యుని వాతావరణంలోకి పంపించనుంది. సూర్యుని చుట్టూ సౌర శక్తి, వేడి ప్రసారం తదితర అంశాలపై దీని ద్వారా సమాచారం సేకరిస్తుంది. సూర్య గ్రహాన్ని అర్థం చేసుకోవడం, అక్కడే జరిగే మార్పులు, అవి సౌర వ్యవస్థకు ఎలా విస్తరించేది, భూమి, ఇతర ప్రపంచంపై దాని ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేయనున్నట్టు నాసా తెలిపింది. ఇంకెందుకు ఆల‌స్యం. వెంట‌నే నాసావెబ్‌సైట్ ద్వారా మీపేర్ల‌ను న‌మోదుచేసుకోండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -