Thursday, May 16, 2024
- Advertisement -

ముఖ్యమంత్రిని పాకిస్తాన్ పంపేయ మంటున్నారు

- Advertisement -

దేశంలో రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా… నేతలు ఎంతగా కత్తులు నూరుకున్నా కూడా జాతీయ ప్రయోజనాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం అంతా ఒకే మాట మీద ఉంటారు. ఇది ఈనాటిది కాదు.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాక్ విషయంలో యుద్ధమో.. ఉద్రిక్తతలో ఏర్పడితే పాలక – విపక్షాలన్నీ ఒకే మాట మీద ఉండడం..

దేశంలోని చిన్నాచితకా పార్టీలూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించకపోవడం జరుగుతుంటుంది. కానీ.. మోడీని తీవ్రంగా వ్యతిరేకించే.. కేంద్రం ఎడ్డెం అంటే తాను తెడ్డెం అనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రం పాక్ విషయంలో భారత్ స్ఫూర్తి నీరుగారేలా మాట్లాడడంతో ఇప్పుడు నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. అంతేకాదు… కేజ్రీవాల్ ను పాకిస్థాన్ పంపేయాలంటున్నారు. ఇటీవల చోటుచేసుకున్న యూరీ ఉగ్రదాడిపై కేజ్రీ తాజాగా చేసిన ట్వీట్ పై ఆయన ఫాలోవర్లు తీవ్రంగా మండిపడ్డారు.

తన సొంత రాజకీయాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని యూరీ దాడిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారని వారు ఆరోపిస్తున్నారు.  పాక్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసే ప్రయత్నంలో భారత్ ఏకాకి అవుతోందన్నట్లుగా కేజ్రీ ట్వీట్ చేశారు.  దీంతో భగ్గుమన్న ట్విట్టర్ యూజర్లు సార్క్ సదస్సుకు ప్రధాని మోడీ హాజరుకాకపోతే.. ఆయనకు బదులుగా కేజ్రీవాల్ ని పాకిస్థాన్ పంపించాలని పోస్టు చేశారు. కొందరైతే కేజ్రీవాల్ కు అసలు బుర్రుందా అంటూ ఆగ్రహంతో రగిలిపోయారు.  ఇంకొందరు రాయలేని బూతులన్నీ ట్విట్టర్లో రాసి కేజ్రీకి గడ్డి పెట్టారు.

దీంతో కేజ్రీకి ఒక విషయం మాత్రం బాగా అర్థమై ఉండాలి. మోడీని తిడినా జనాలు సహిస్తారు కానీ.. ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం ఊరుకోరని కేజ్రీకి అర్థమయ్యుండాలి. గతంలో మోడీ కు వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా నెటిజన్లు ఎన్నడూ ఆయనపై ఇంతగా మండిపడలేదు. ఇండియా ఏకాకి అయిపోతుందని ఆయన అనడంతో మాత్రం ప్రజలు సీరియస్ గా రెస్పాండయ్యారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -