Sunday, May 19, 2024
- Advertisement -

ఎపి నుంచి నలుగురు.. తెలంగాణ నుంచి ఇద్దరు

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యులుగా నామినేషన్ల వేసిన వారంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇటు తెలంగాణలోనూ కూడా ఏకగ్రీవ ఎన్నికలు కావడం విశేషం. తెలంగాణ నుంచి ఇద్దరు సభ్యులు రాజ్యసభకు వెళ్లేందుకు అవకాశం ఉంది. ఈ ఇద్దరూ అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమతి నుంచి ఎన్నికయ్యారు. వీరిలో ఒకరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇటీవలే టిఆర్ఎస్ లో చేరిన డి.శ్రీనివాస్. మరొకరు టిఆర్ఎస్ ప్రారంభం నుంచి కె.చంద్రశేఖర రావు వెంట ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంత రావు.

వీరిద్దరు మినహా మిగిలిన పార్టీల నుంచి ఎవ్వరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వీరు గెలిచినట్లుగా తెలంగాణ శాసనసభ కార్యదర్శి వీరికి పత్రాలు అందజేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో నలుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో ముగ్గురు అధికార పార్టీ సభ్యులే. అధికార తెలుగుదేశం పార్టీకి మూడు స్ధానాలు గెలుచుకునే అవకాశం ఉండడంతో రెండు స్ధానాల నుంచి టిడిపి సభ్యులు పోటీ చేశారు. ఒక స్ధానాన్ని మాత్రం మిత్రపక్షమైన బిజెపికి ఇచ్చారు.

ఈ స్ధానం నుంచి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన రెండు స్ధానాల నుంచి కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టి.జి.వెంకటేష్ ఎన్నికయ్యారు. నాలుగో స్ధానం నుంచి ప్రతిపక్ష పార్టీకి చెందిన విజయసాయిరెడ్డి ఎన్నికయ్యారు. ఈ స్ధానానికి కూడా పోటీ చేయాలని తెలుగుదేశం భావించినా ఆఖరి నిమిషంలో ఆ ఆలోచన విరమించుకుంది. దీంతో ఇక్కడి నుంచి కూడా రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. వీరికి కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి పత్రాలను అందజేశారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -