Tuesday, May 21, 2024
- Advertisement -

దేశంలో తర్వాతి ఉరి శిక్ష అమలు వాళ్లకేనా…?!

- Advertisement -

ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా ఉరి శిక్షను రద్దు చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. అనేక దశాబ్దాలుగా ఈ విషయంలో పోరాడుతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు.  ఇప్పటికే ఈ డిమాండ్లకు అనుగుణంగా అనేక దేశాల్లో ఉరి శిక్షను రద్దు చేశారు.

మరి కొన్ని దేశాల్లో మాత్రం ఉరి అమల్లో ఉంది. మన దేశం చట్టాలు కూడా ఉరిని సమర్థిస్తున్నాయి. ఆ మధ్య ఐక్యరాజ్యసమితిలో ఉరి గురించి చర్చ జరిగితే.. ఆ చర్చలో కూడా ఇండియా ఉరి రద్దును సమర్థించలేదు.

మనిషిని చంపే హక్కు మరో మనిషికి లేదన్న సిద్ధాంతం ప్రకారం చూస్తే ఉరి శిక్ష విధించే అధికారం చట్టానికి కూడా లేదు. ఎంత తీవ్రమైన నేరం చేసినా.. కఠినమైన కారాగార శిక్షలు తప్ప… ఉరి విధించడానికి లేదు. అయితే ఇండియన్ గవర్నమెంటుతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఈ విషయంలో తగ్గడం లేదు. ఈ మధ్యనే మనదేశలో ఉగ్రవాది టైగర్ మెమన్ కు ఉరి శిక్షను అమలు చేశారు. అయితే ఇండియాలో ఉరిశిక్ష అమలు అనేది అరుదుగానే జరుగుతోంది.

చాలా సంవత్సరాల నుంచి చూసుకొంటే.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను హత్య చేసిన ధనుంజయ్ చటర్జీ, ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అఫ్జల్ గురు.. తాజాగా టైగర్ మెమన్ లకు మాత్రమే ఉరిశిక్షలు అమలయ్యాయి. ఇంకా అనేక మందికి ఉరిశిక్ష పడినా.. దాని అమలు మాత్రంపెండింగ్ లో ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో దేశంలో నెక్ట్స్ ఉరిశిక్ష గనుక అమలు అయితే.. అది నిర్భయ దోషులకేనని తెలుస్తోంది. ఢిల్లీలో నిర్భయను కొంతమంది దుర్మార్గులు అత్యంత కిరాకతంగా అత్యాచారం చేసి.. హతమార్చిన సంగతితెలిసిందే. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. వారికి ఉరిశిక్షను విధించింది. అయితే అమలు మాత్రం జరగలేదు. మరి ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. దేశంలో మళ్లీ  ఇప్పుడప్పుడు ఉరిశిక్ష అమలు జరిగితే అది నిర్భయ దోషులకేనని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -