Tuesday, May 7, 2024
- Advertisement -

చిదంబరానికి సుప్రీంకోర్టులో మరో సారి చుక్కెదురు

- Advertisement -

ఐఎన్‌ఎక్స్‌ మనీల్యాండరింగ్‌ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి సుప్రీంకోర్టులో మరో సారి చుక్కెదురయ్యింది. తనకు ఈడీ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయ స్థానం తిరస్కరించింది. ఈడీ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయ స్థానం ముందుస్తు బెయిల్‌ ఇవ్వాలన్న చిదంబరం పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఆర్థిక నేరాల్లో మాత్రమే అత్యంత అరుదుగా ముందస్తు బెయిల్‌ను ఉపయోగించుకోవాలని, వాస్తవాలను, పరిస్థితులను పరిశీలించిన మీదట ఈ కేసు ముందస్తు బెయిల్‌ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దర్యాప్తు చేస్తున్న సంస్థలు తమ దర్యాప్తును కొనసాగించడానికి వీలుగా స్వేచ్ఛనివ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఇప్పటికే సీబీఐ చిదంబరాన్ని అరెస్టు చేసింది. ఈడీ కూడా అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయినా ప్రయోజనం దక్కలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -