Sunday, May 19, 2024
- Advertisement -

నితీశ్​ సర్కార్​ టీకా పై మొదటి నిర్ణయం..!

- Advertisement -

టీకాల లభ్యత ఆధారంగా బిహార్​ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్​ను పంపిణీ చేసేందుకు నితీశ్​ సర్కార్​ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల మ్యానిఫెస్టో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రంలో ఉచిత కరోనా వ్యాక్సిన్‌ను బిజేపి అందిస్తుందని మాటిచ్చారు. బిజేపి సహకారంతో మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన నితీశ్.. మొదటి కేబినెట్​ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికల వేళ కరోనా టీకాను ఉచితంగా అందిస్తామని హామీలు ఇవ్వడంపై రాజకీయంగా తీవ్ర చర్చ జరిగింది. ఓటు వేస్తేనే టీకా ఇస్తారా? అంటూ భాజపాపై విపక్షాలు మండిపడ్డాయి. ఇటీవల కేరళలోనూ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని ఆ రాష్ట ముఖ్యమంత్రి పినరయ విజయన్ ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వాగ్దానమే చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -