టెన్నిస్‌ ఆడడం మానేస్తా, వ్యాక్సిన్‌ మాత్రం తీసుకోను.. స్పష్టం చేసిన జకోవిచ్‌

- Advertisement -

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేశాడు. ఎటువంటి పరిణామాలు అయినా ఎదుర్కొనేందుకు సిద్దం, కానీ కరోనా వ్యాక్సిన్‌ మాత్రం తీసుకోనని తేల్చిచెప్పాడు. వ్యాక్సిన్‌ తీసుకున్న క్రీడాకారులే టోర్నీలో పాల్గొనాలంటే వింబుల్డన్‌ , ఫ్రెంచ్‌ ఓపెన్‌లో కూడా పాల్గొన నని చెప్పాడు.

బీబీబీలో ఇంటర్వ్యూలో జకోవిచ్‌ మాట్లాడాడు. అవసరమైతే ఫ్రెంచ్, వింబుల్డన్‌ టోర్నీల నుంచి తప్పుకుంటాను కానీ టీకా మాత్రం వేసుకోనని తేల్చిచెప్పాడు. వ్యాక్సిన్‌పై తన వైఖరిలో ఎటువంటి మార్పు లేదని మరోసారి స్పష్టం చేశాడు.

- Advertisement -

ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను సాధించిన ఈ సెర్బియన్‌ స్టాన్‌ గత నెలలో జరిగిన ఆస్ట్రేలియన్‌ వింబుల్డన్‌ టోర్నీ నుంచి వ్యాక్సిన్‌ తీసుకోని కారణంగా నిష్క్రమించాడు. అతని వీసాను కూడా ఆస్ట్రేలియా రద్దు చేయడం సంచలనంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -