Saturday, May 18, 2024
- Advertisement -

వన్న క్రై మాల్‌వేర్ సైబ‌ర్ దాడి మూలాలు ఉత్త‌ర కొరియాలో ఉన్న‌ట్లు అనుమానం వ్య‌క్తం చేసిన సైబ‌ర్ నిపునులు

- Advertisement -
North Korea possibly behind global cyberattack, researchers say

ఇంట‌ర్నెట్ ప్రపంచాన్ని వణికిస్తున్న వన్న క్రై మాల్‌వేర్‌కు సంబంధించిన కొత్త కోణం ఒకటి బయటకు వచ్చింది.ఇప్పటివరకూ ఈ మాల్‌వేర్‌కు అగ్రరాజ్యం అమెరికాకు లంకె ఉన్నట్లుగా వస్తున్న వాదనలు తప్పని.. .అయితే వన్న క్రై మాల్‌వేర్ మూలాల‌ సైబర్ అటాక్ వెనుక నార్త్ కొరియా ఉన్నట్టు సెక్యురిటీ రీసెర్చర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఉన్న రష్యా, అమెరికాల మధ్య తాజాగా మరో రాజకీయ యుద్ధం సృష్టించడానికి ఉత్తరకొరియా ఈ పన్నాగం పన్నినట్టు వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వన్నాక్రై సైబర్ అటాక్ ముప్పు కాస్త తగ్గినప్పటికీ, ఇప్పటికే 3,00,000 కంప్యూటర్లు హ్యాకైనట్టు టాప్ అమెరికా అధికారి చెప్పారు.
బీభత్సం సృష్టించిన ఈ వన్నాక్రై సైబర్ దాడికి, విస్తృతంగా హ్యాకింగ్ కు ప్రయత్నించే ప్యోంగ్యాంగ్ కు సంబంధమున్నట్టు ఓ గూగుల్ రీసెర్చర్ కంప్యూటర్ కోడ్ ను పోస్టు చేశాడు. ఇతర రీసెర్చర్లు కూడా కచ్చితంగా ఈ కుట్ర వెనుక ఉన్నది నార్త్ కొరియానేనని చెబుతున్నారు. ఇజ్రాయిల్ కు చెందిన ఓ సెక్యురిటీ సంస్థ ఇంటెజర్ ల్యాబ్స్ కూడా నార్త్ కొరియాకే ఈ చర్యను ఆపాదించింది. ఇప్పటికే ఖండాతర క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలను ఆందోళన పెడుతున్న ఈ దేశం ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.

{loadmodule mod_custom,Side Ad 1}

వన్నక్రై మాల్‌వేర్‌.. అమెరికా-రష్యాల మధ్య విభేదాలను సృష్టించింది. ఈ సైబర్‌ దాడి విషయంలో పుతిన్‌ ఘాటుగా స్పందించారు. ‘సీసాలో నుంచి భూతం బయటకు వచ్చింది. ఇప్పుడది దాని సృష్టికర్తలనే నాశనం చేస్తోంది’ అని బీజింగ్‌లో సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించారు.అయితే దీనికి ధీటుగా అమెరికా స‌మాధాన మిచ్చింది.దీనిపై ట్రంప్‌ సైబర్‌ అడ్వైజర్‌ టామ్‌ బాస్‌రట్‌ స్పందిస్తూ ‘సైబర్‌ దాడికి ఉపయోగించిన టూల్‌ను ఎన్‌ఎస్‌ఏ తయారు చేయలేదు. ఇదో రకంగా ప్రపంచంపై దాడి’ అని తెలిపారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న మాల్‌వేర్‌ మూలాలు ఉత్తరకొరియాలో ఉన్నట్లుగా సైబ‌ర్ నిపునులు పేర్కొంటున్నారు.సైబ‌ర్ దాడి జ‌ర‌గిన‌ప్ప‌టినుంచి అమెరికాపై విమ‌ర్శ‌లు వెల్లు వెత్తాయి. మాల్‌వేర్‌ మూలాలు ఉత్తరకొరియాలో ఉన్నట్లుగా వస్తున్న వాదనలు ఇప్పుడు కొత్త సంచలనంగా మారాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -