Sunday, May 19, 2024
- Advertisement -

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో కొత్త నిబంధన

- Advertisement -

ఈ నెల 22 న జరుగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. ఈ పరీక్షని నిర్వహించే ఐఐటి గుహవటి ఈ నిబంధనలను రూపొందించింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు వేళ్లకు ఉంగరాలు ధరించకూడదు.

పొడుగు చేతుల చొక్కా ధరించకూడదు. వీటితో పాటు గడియారం, బూట్లు ధరించడానికి వీల్లేదు. ఇక లోహాలతో తయారు చేసిన ఆభరణాలను కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష హాలుకు తీసుకురావద్దని ప్రకటించింది. వీటితో పాటు హైహీల్స్, చొక్కాలకు పెద్ద గుండీలు ఉన్నా కూడా పరీక్ష హాలులోకి రావవ్వమని ఐఐటి గువహటి తేల్చి చెప్పేసింది.

దీనికి కారణం ఏమిటో మాత్రం తెలియజేయకపోవడం విశేషం. అయితే హైటెక్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవడమే దీని వెనుక ఉన్న ప్రధాన కారణమని చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -