Sunday, May 19, 2024
- Advertisement -

సంక్రాంతి బ‌రిలో పాకిస్థాన్ కోళ్లు….

- Advertisement -

మరో వారం రోజుల్లో సంక్రాంతి పండగ రానుంది. పందేల‌కు కోళ్లు సిద్ద‌మ‌వుతున్నాయి. కోడి పందేలే కాదు ఇంటి ముంగిట అమ్మాయిలు అందంగా వేసే రంగురంగుల ముగ్గులు, నోరూరించే పిండి వంటలు, భోగి మంటలు, సంక్రాంతి కానుకగా విడుదలయ్యే ప్రముఖ హీరోల సినిమాలు, సంతోషించే అభిమానులు.. ‘ఇలా సంక్రాంతి’ గురించి చెప్చొరు.

అయితే ఈసారి కోడి పందేల్లో అస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకోనుంది. గోదావరి జిల్లాల్లో నిర్వహించే కోడిపందేలు. పందెం బరిలో దిగే కోడి పుంజులు..వాటి నిర్వాహకులు ఎంతో ఉత్సాహంగా పోటీపడతారు. ఇప్పటికే కోనసీమలో ఈ సందడి మొదలైంది. ఈసారి కోడి పందేల‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది.

గోదావరి జిల్లాల కోళ్లతో తలపడేందుకు పాకిస్తాన్ కోళ్లను సిద్ధం చేస్తున్నార. కోనసీమ పందెం కోళ్ల పెంపకం దారులు ఆ దేశపు కోళ్ల బ్రీడ్ ను ఇక్కడికి తెప్పించుకుని పెంచుతున్నారు. పాక్ కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. కేవలం పాక్ దేశపు కోళ్లనే కాకుండా తైవాన్, ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి ఆయా బ్రీడ్స్ కోళ్లను తెప్పించి పెంచుతున్నారని సమాచారం. అయితే కోడిపందేల‌ను నిర్వ‌హించ వ‌ద్ద‌ని హైకోర్టు ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కోడి పందేల‌కు ఎన్ని నిబంధ‌న‌లు పెట్టినా కోడి పందేలు మాత్రం ఆగ‌వు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -