Tuesday, April 30, 2024
- Advertisement -

ఉభయగోదావరి జిల్లాలు ఎటువైపో!

- Advertisement -

ఏపీలో అధికారంలోకి ఏ పార్టీ రావాలన్న ఉభయగోదావరి జిల్లాలే కీలకం. గత ఎన్నికల పోలింగ్ సరళి పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిస్తే ఆ పార్టీదే అధికారం. 2014లో ఈ రెండు జిల్లాల్లోని మొత్తం 34 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి కేవలం 5 స్థానాలు మాత్రమే రాగా టీడీపీకి 26 సీట్లు వచ్చాయి. అప్పుడు అధికారంలోకి వచ్చింది టీడీపీనే.

ఆ తర్వాత 2019లో వైసీపీకి 27 సీట్లు కట్టబెట్టారు ఉభయగోదావరి జిల్లాల ప్రజలు. వైసీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అందుకే ఈసారి ఉభయగోదావరి జిల్లాల ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటు వైసీపీ, అటు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు ఈ రెండు జిల్లాల్లో స్పష్టమైన ఆధిక్యం సంపాదించుకోవడం కోసం తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తుండగా త్వరలోనే వైసీపీ అధినేత జగన్ కూడా పర్యటించనున్నారు. మొత్తంగా ఈ రెండు జిల్లాల్లో ఎవరిది పై చేయి అవుతుందో కొద్దిరోజుల్లో తేలిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -