Wednesday, May 22, 2024
- Advertisement -

అంబేద్కర్ వలనే కాలేదు నేనెంత ? – నరేంద్ర మోడీ !

- Advertisement -

దళితుల ఓటు బ్యాంకు మీద ప్రధాని మంత్రి బాగా భారీగా గురిపెట్టారు అని స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కి పెట్టిన కోటలా దళితులు ఇన్నాళ్ళూ వారికితోడు ఉన్నారు కానీ వారిని బీజేపీ వైపు తిప్పుకోవాలి అనేది మోడీ ప్రధాన ఆలోచనగా తెలుస్తోంది. ఈ మధ్య కాలం లో దళితుల మనసులు గెలుచుకోవడం కోసం ఆయనని ఎంత చిన్న అవకాసం ఒచ్చినా ఒదులుకోవడం లేదు మోడీ.

అంబేద్కర్ జాతీయ స్మారక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మోడీ దళితుల మనసులు దోచుకునే విధంగా ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నంతవరకూ దళితులు.. బడుగువర్గాలకు ఇచ్చే రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి ముప్పు ఉండదని తేల్చిన ఆయన.. కొందరు రాజకీయ నాయకులు ప్రజల్ని తప్పుదారి పట్టేలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ తమను విమర్శించే వారిపై గురి పెట్టారు.

మధ్యప్రదేశ్.. గుజరాత్.. మహారాష్ట్ర.. పంజాబ్.. హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నో ఏళ్లుగా పరిపాలించినా.. ఎప్పుడు తాము దళితుల కోటాకు కోత వేయలేదని.. అలాంటి సాహసం తాము ఎప్పటికీ చేయమని చెప్పుకోవటం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మరికాస్త ముందుకు వెళ్లి.. చివరకు అంబేడ్కరే మళ్లీ వచ్చినా దళితుల హక్కుల్ని లాగేసుకోలేరని చెప్పేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -