Saturday, May 18, 2024
- Advertisement -

మోదీ అనే నేను..

- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేష్ తాజా చిత్రం భ‌ర‌త్ అను నేను సినిమా సూప‌ర్ టాక్‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ప్ర‌భావం మ‌న దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై ప‌డినట్లు ఉంది.ఈ సినిమాలో యంగ్ సీఎంగా మ‌హేష్ న‌టించాడు. సినిమాలో ప్ర‌ధానంగా రెండు, మూడు విష‌య‌ల మీద ఫోక‌స్ పెట్టాడు డైర‌క్ట‌ర్ కొర‌టాల‌. ముఖ్యంగా గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్‌,గ్రామీణాభివృద్ది ,ట్రాఫిక్ ఇలాంటి ప్ర‌ధాన స‌మ‌స్య‌ల మీద సినిమా ఉంటుంది.

ఈ సినిమాలో మ‌హేష్ చెప్పిన మాట‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెడుతున్నాడు ప్ర‌ధాన మంత్రి మోదీ. గ్రామాలు అభివృద్ది చెందితే దేశం దానంత‌ట అదే అభివృద్ది చెందుతుంద‌ని మ‌హేష్ చెప్పిన మాట‌ల‌ను ఈ రోజు(మంగ‌ళ‌వారం) జ‌రిగిన ప‌బ్లిక్ మీటింగ్‌లో మోదీ దీని గురించే ప్ర‌స్తావించారు. యాదృచ్చిక‌మో లేక మ‌హేష్ సినిమా ప్ర‌భావ‌మో కాని సినిమాలో మ‌హేష్ చెప్పిన మాట‌ల‌నే మోదీ మాట్లాడారు.ప్ర‌తి గ్రామానికి 5 కోట్లు బ‌డ్జెట్‌లో కేటాయిస్తే వారికి కావ‌ల్సిన వ‌సతులు వారే చూసుకుంటారని భ‌ర‌త్ అను నేను సినిమాలో మ‌హేష్ చెబుతాడు.

మ‌రి ఈ సినిమా ప్ర‌భావం మ‌న నాయ‌కుల మీద ఎంత చూపిస్తుందో చూడాలి. గ‌తంలో మ‌హేష్-కొర‌టాల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన శ్రీమంతుడు సినిమాలోని ఎంతో కొంత ఊరికి తిరిగిచ్చేయాలి కాన్సెప్ట్ రెండు తెలుగు రాష్ట్ర‌ల‌పై చాలా ప్ర‌భావ‌మే చూపించింది. ఈ సినిమా వ‌ల్ల చాలా మంది గ్రామాలను ద‌త్త‌త తీసుకున్న వారు ఉన్నారు.ఇప్పుడు తాజాగా వచ్చిన భ‌ర‌త్ అను నేను సినిమా ప్ర‌భావం మ‌న రాజకీయ నాయ‌కుల‌ను ఎంత‌మేర‌కు ప్ర‌భావితం చేస్తుందో చేడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -