Saturday, May 18, 2024
- Advertisement -

ఇంత పెద్ద పొడుగా… అమ్మనా పోలీసోడా

- Advertisement -

టైటిల్ చూసి రొమాంటిక్ కంటెంట్ అనుకునేరు. విషయం అది కాదులెండి. ఇది సాహోసపేతమైన ఓ పోలీసోడు దిగిన ఫొటో గురించి చెబుతున్న స్టోరి. ఏ దేశంలోనైనా ఎక్కడైనా… పోలీసులకు డ్యూటీలు ,షిప్ట్ లనేవి ఎప్పుడూ వివాదాలతో కూడుకున్నవే. ఒక్క మన కేసీఆర్ సారే.. వారికంటూ సెలవులు ప్రకటించాడు. బహుశా ఇదే విధానం కొన్ని పాశ్చాత్య దేశాలలో కూడా ఉండి ఉండొచ్చు. కాకపోతే మనకు తెలిసినంత వరకు పోలీసులు అనుకునేవారి అసలు రెస్టే ఉండదు. లీవ్ అంతకంటే ఉండదు. ఎంతోకాలం నుంచి మనం ఈ రెగ్యులర్ గోలను చూస్తున్నదే. ఆ సమయంలో వారు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కొంతమంది మాత్రమే ప్రాక్టికల్ గా థింక్ చేసి డ్యూటీని ఎంజాయ్ చేస్తుంటారు.

ఇపుడు మనం చూడబోయేది అలాంటి మహానుబావుడినే. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఓ పోలీసు అధికారి ఉన్నాడు. అతగాడు తన జూనియర్‌ తో కలిసి అడవిలో గస్తీ తిరుగుతున్నాడు. ఈ సందర్భంగా ఓ భారీ సైజ్ కొండచిలువ… ఆల్మోస్ట్ అనకొండలాంటిది.. తన మానాన తాను పోతూ ఈ పోలీసాయన కంట కనబడింది. అయితే ఈ పామును చూసిన ఆయనగారు ఎక్కడా భయపడకుండా… దానికి చేరువలో నిలబడి…పాము వెల్లే విధానాన్ని చూస్తూ… ఓ ఫొజుఇచ్చాడు. ఈ పోజుని జూనియర్‌ గారు ఓ క్లిక్ కొట్టారు. ఏకంగా ఐదుమీటర్ల పొడవున్న ఈ కొండచిలువతో ఆ పోలీసాయన దిగిన ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఓ రేంజ్లో హల్‌చల్‌ చేస్తోంది.

నిజానికి ఈ ఫొటో దిగి చాలాకాలమే అయింది. అయితే ఈ ఫొటోను క్వీన్స్‌లాండ్‌ పోలీసులు రీసెంట్ గా తమ సోషల్‌ మీడియా పేజీలో ఈ సోమవారం షేర్‌ చేసుకున్నారు. ‘మా డ్యూటీ అంత బోరింగ్‌ ఏమీ ఉండదు. సింగిల్‌ షిఫ్ట్‌లో ఏం ఎదురుపడుతుందో చెప్పలేం’ అంటూ పోలీసులు పెట్టిన ఈ పోస్ట్‌ను ఇప్పటికే 20లక్షలకుపైగా మంది ఈ ఫొటోను చూసేశారు. 10వేల కామెంట్లు పెట్టారు. ‘మోన్‌స్టర్‌ పైథాన్‌’ ఓ మైగాడ్‌, హెల్‌ నో అంటూ కామెంట్లు అందుల్లో కనిపిస్తాయి. క్వీన్స్‌ల్యాండ్‌ ఉత్తర నగరం కైర్న్స్‌కు 345 కిలోమీటర్ల దూరంలోని వుజుల్‌ అడవిలో ఈ భారీ కొండచిలువగారు… పోలీసు అధికారులకు దర్శనమిచ్చారట. ఇక్కడ చెపుకోవల్సిన ఇంకో విశేషమేమిటంటే… క్రూబ్‌ పైథాన్‌లు ఆస్ట్రేలియాలోనే పొడవైనవి. ఒక్కొక్కటి ఏడు మీటర్లు అనగా 23అడుగుల వరకు పెరుగుతాయట.అవి అంతంత సైజ్ ఉంటే మనల్ని పట్టుకుంటే గుటకాయ స్వాహానే కదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -