Sunday, May 19, 2024
- Advertisement -

విచార‌ణ పుకార్ల‌పై రామ్‌గోపాల్ వ‌ర్మ క్లారిటీ

- Advertisement -

ఒక్క వెబ్ సిరీస్ టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్ (జీఎస్టీ) పేరిట ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఓ వెబ్‌ సిరీస్ తీశాడు. ఆ వెబ్ సిరీస్‌లో మియా మాల్కొవా అందాన్నంతా అంగాంగం వ‌ర్ణిస్తూ.. క‌ళాత్మ‌కంగా తీశాడు. అయితే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి మ‌హిళ‌ల సంఘాల నుంచి తీవ్ర నిర‌స‌నలు వ్య‌క్త‌మ‌య్యాయి. పైగా ఈ సిరీస్‌పై ఓ చ‌ర్చ నిర్వ‌హించ‌గా.. ఓ టీవీ చానెల్‌లో ఓ మ‌హిళతో జీఎస్టీ నీతో తీస్తా అని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. మియా మాల్కొవా కంటే మీరే అందంగా ఉన్నార‌ని వ్యాఖ్య‌లు చేయ‌డంతో మ‌హిళా సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకించాయి.

వెంట‌నే వ‌ర్మ‌పై పోలీసుల‌కు కేసుల మీద కేసులు పెట్టారు. దీంతో వర్మను శనివారం హైద‌రాబాద్‌లో సీసీఎస్‌ పోలీసుల విచారణ చేప‌ట్టారు. పోలీసులు ఆయన ల్యాప్‌టాప్‌ను సీజ్‌ చేశారు. తదుపరి విచారణకు శుక్రవారం రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే విచారణలో ఈ వెబ్‌ సిరీస్‌ను తాను విడుద‌ల చేయలేదని, ద‌ర్శ‌క‌త్వం చేయలేదని చెప్పినట్లు అదనపు డీసీపీ రఘువీర్‌ తెలిపారు.

దీనిపై వర్మ సోషల్‌మీడియాలో స్పందించారు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జీఎస్టీ’ వెబ్ సిరీస్‌ను తాను తీయ‌లేద‌ని చెప్ప‌డం స‌రికాదు. కేవలం సాంకేతిక అంశాలకు మాత్రమే సహకరించినట్లు చెప్పడం అవాస్త‌వం. నేను తీసిన సినిమాను తీయలేదని ఎందుకు చెప్తాను? సినిమాను నేనే డైరెక్ట్‌ చేసినట్లు సిరీస్‌లో ఉందిగా?’ అని వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ విధంగా వ‌ర్మ నెటిజ‌న్ల‌కు రిప్ల‌యి ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -