Friday, May 17, 2024
- Advertisement -

లోక క్షేమం కోస‌మే జ‌గ‌న్‌ని క‌లిశాను.. అంద‌ర్ని క‌లుస్తాను

- Advertisement -

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌ధాన‌ అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు వివాదం రోజుకో మ‌లుపు తిరుగుంది.తిరుమ‌లలో చాలా అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ర‌మ‌ణ దీక్షుతులు.దీంతో అత‌న‌ని దేవ‌స్థానం విధుల నుండి త‌ప్పించింది ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం.విధులు నుండి త‌ప్పించిన ద‌గ్గ‌ర నుండి ర‌మ‌ణ దీక్షుతులు ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు పెంచారు. వైఎస్ జ‌గ‌న్ ర‌మ‌ణ దీక్షుతులు వెనుక ఉండి న‌డిపిస్తున్నాడ‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు తెలుగుదేశం నాయ‌కులు.ఇలాంటి సంద‌ర్భంలో గురువారం ర‌మ‌ణ దీక్షితులు వైఎస్ జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది.

దీనిని తెలుగు దేశం నాయ‌కులు ఒక ఆయుధంగా మార్చుకుని వైఎస్ జ‌గ‌న్‌,ర‌మ‌ణ దీక్షితులపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.దీనిపై స్పందించిన ర‌మ‌ణ దీక్షితులు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌ల‌వ‌డానికి మూడు సార్లు ప్ర‌య‌త్నించాన‌ని, కాని ఆయ‌న నన్ను క‌ల‌వ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. దీంతో ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్‌ను క‌లిసి త‌న‌కు జరిగిన అన్యాయం గురించి వివరించాన‌ని చెప్పారు. వైఎస్ జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డం త‌ప్పేం కాద‌ని, లోక క్షేమం కోసం ఎవ‌రినైన క‌లుస్తాన‌ని ,త్వ‌ర‌లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కన్నా ల‌క్ష్మినార‌య‌ణ‌ను క‌లుస్తాన‌ని చెప్పుకొచ్చారు.తిరుప‌తిలో జ‌రుగుతున్న అన్యాయాలు, అక్ర‌మాలు గురించి అంద‌రిని క‌లిసి వివ‌రిస్తాన‌ని ర‌మ‌ణ దీక్షితులు పెర్కొన్నారు.తిరుప‌తి ప‌విత్ర‌త‌ను కాపాడ‌ట‌మే త‌న ధ్యేయం అని వివ‌రించారు. మ‌రి ర‌మ‌ణ దీక్షితులు చేసిన కామెంట్స్‌ను తెలుగుదేశం నాయ‌కులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -