Saturday, May 18, 2024
- Advertisement -

గోదావరిలో ప్రమాదానికి గురయిన బోటు యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు..

- Advertisement -

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు మునిగిపోయిన ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఈ ఘటనలో 40 మంది జలసమాధి అయ్యారు. ప్రమాదానికి కారణం అయిన రాయల్ వశిష్ట బోటు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోటు ప్రమాదానికి కారణమైన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

రాయల్ వశిష్ట బోటు యాజమాని నిందితుడు కోడిగుడ్ల వెంకటరమణ, ఎల్లా ప్రభావతి, అచ్యుత రమణిలను అరెస్ట్ చేసినట్లు రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం తెలిపారు.వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.గోదావరి నదిలో సుడిగుండాల నుంచి తప్పించుకోలేక బోటు నీట మునిగిన సంగతి తెలిసిందే. బోటు 200 అడుగుల లోతున ఉన్నట్టు గుర్తించినా, దాన్ని బయటికి తీసుకురావడంలో నిపుణులు సైతం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

మిగిలిన ముద్దాయిల గురించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఏఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. నిందితులను రంపచోడవరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన రోజు దేవీపట్నం పోలీస్ స్టేషన్లో బోటు సిబ్బందిపై పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బోటు ఓనర్స్ , టూర్స్ అండ్ ట్రావెల్స్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -