Saturday, May 18, 2024
- Advertisement -

రూ200 నోటును మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ క‌స‌ర‌త్తు

- Advertisement -
RBI clears proposal to introduce Rs 200 notes

దొంగ నోట్ల నివార‌న‌… బ్లాక్ మ‌నీకి చెక్ పెట్టేందుకు నోట్ల ర‌ద్దునిర్ణ‌యం తీసుకుని సంచ‌ల‌నం సృష్టించిన కేంద్రం ఇప్పుడు మ‌రో నిర్ణ‌యం తీసుకోబోతోంది. రెండు వందల రూపాయల నోటు త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది.

ఈ ప్రతిపాదనకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత నెలలో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చాక… కొత్త రెండు వందల రూపాయల నోటు…రాబోతోంది.
కొత్త రెండు వేల రూపాయల నోట్లను జూన్ తర్వాత ముద్రించే అవకాశ ముంది. ఇప్పటికే నమూనా నోటు సిద్ధమయ్యింది. దొంగ నోట్లను అరికట్టాలంటే కరెన్సీ నోట్లలో తరచూ మార్పులు చేయాలని నిపుణులు చూస్తున్నారు. ఇప్పుడున్న పెద్ద నోట్లకు చిల్లర కావాలంటే 200 రూపాయల నోటును ప్రవేశపెట్టడమే సరైన నిర్ణయమని ఆర్బీఐ భావిస్తోంది. గతంలో ఎప్పుడూ రెండు వందల రూపాయల నోట్లను ముద్రించిన దాఖలాలు లేవు.

{loadmodule mod_custom,Side Ad 1}

కొత్త వంద రూపాయల నోటును కూడా ఆర్బీఐ తీసుకొస్తోంది. కొత్త నోటు వచ్చినా… పాత నోట్లు మాత్రం చెల్లుబాటవుతాయని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. కొత్త వంద నోటులో నంబర్ ప్యానెల్స్ … ఇన్ సెట్ లెటర్లేమీ ఉండబోవని సమాచారం. రెండు వేల రూపాయల నోట్లను రద్దుచేయాలంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో…చిన్న నోట్లను ఎక్కువ తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.
దేశమంతా డిజిటల్ మనీ తీసుకొద్దామనుకున్నా అది సాధ్యంకాదని కేంద్రం భావిస్తోంది. క్యాస్ లెస్ బదులు… చిన్న నోట్లను ఎక్కువ తీసుకొస్తే బెటరన్న అభిప్రాయానికి వచ్చింది. అందుకే కొత్తగా వంద, రెండు వందల రూపాయల నోట్లను… సరికొత్త డిజైన్లలో తీసుకురానున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -