Saturday, May 18, 2024
- Advertisement -

విండోస్ కొత్త అప్‌డేట్ వ‌చ్చే వ‌ర‌కు ఏటీఎంల‌ను తెర‌వ‌ద్దు ఆర్బీఐ…

- Advertisement -
RBI says Open ATMs only after software update

దేశంలో కొన్ని రోజుల వ‌ర‌కు అన్ని ఏటీఎంలు బంద్ కానున్నాయి. ప్ర‌పంచాన్ని వ‌నికించిన‌ ప్రపంచాన్ని వణికిస్తున్న వాన్నా క్రై వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని విండోస్‌ అప్‌డేట్‌ వచ్చే వరకూ ఏటీఎం సెంటర్లను మూసేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది.

కంప్యూటర్‌లోకి ర్యాన్‌సమ్‌ వేర్‌ను చొప్పించి డేటాను చోరి చేసి బిట్‌ కాయిన్ల రూపంలో డాలర్లను.. వాన్నా క్రై డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.
సోమవారం రెండో సారి వాన్నా క్రై హ్యాకింగ్‌కు పాల్పడతుందనే వార్తలతో ప్రపంచదేశాల‌న్నీ అప్రమత్తమవుతున్నాయి.దీనిలో భాగంగానే భార‌త్‌కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యింది.వాన్నా క్రై బాధితుల్లో ఎక్కువ మంది ఉప‌యేగించే సాప్ట్‌వేర్ విండోస్‌.మ‌న దేశంలో 90 శాతం మంది దీన్నే వాడుతున్నారు.మన దేశంలో ఉన్న 2.25 లక్షల ఏటీఎంలలో 60 శాతం విండోస్ ఆపరేటింగ్‌ సిస్టంతో నడిచేవే.

{loadmodule mod_custom,Side Ad 1}

దీన్ని దృష్టిలో పెట్టుకొని రక్షణ చర్యలు చేపట్టిన ఆర్‌బీఐ సెక్యూరిటీ అప్‌డేట్ వచ్చే వరకూ ఏటీఎంలను తెరవొద్దని ఆదేశాలు జారీ చేసింది. వాన్నా క్రై లక్ష్యం ఏటీఎంల నుంచి ప్రజల డబ్బును దొంగిలించడం కాదని.. నెట్‌వర్క్‌లలో సమాచారాన్ని లాక్‌ చేసి డబ్బును డిమాండ్‌ చేస్తుందని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు.
ఒకవేళ వాన్నా క్రై ఏటీఎంల నెట్‌వర్క్‌లను హ్యాక్‌ చేస్తే.. వినియోగదారులు ఎలాంటి లావాదేవీలు జరపలేరిని వివరించారు. అయితే, ఇప్పటికే రెండు దక్షిణాది బ్యాంకుల కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయనే పుకార్లు కూడా వస్తున్నాయి. ఆర్‌బీఐ దీని మీద ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఖాతాదారులు జాగ్ర‌త్త‌గా ఉండండి.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}vEgSXEaN0HM{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -