Monday, May 12, 2025
- Advertisement -

రిలయన్స్ మరో సంచలనం.. కేవలం 5 రూపాయలకే క్యాబ్

- Advertisement -
Reliance Bumper Offer 5 Rupess Cab Services

నిన్నటిదాకా మొబైల్ నెట్వర్కింగ్లో టాపర్ గా ఉన్న ఎయిర్ టెల్ ను భారీ దెబ్బ కొట్టింది రిలయన్స్ జియో. ఒక్క ఎయిర్ టెల్ కాకుండా ఇతర కంపెనీలకు కూడా గట్టి దెబ్బ పడింది. ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వాటిలో ప్రభుత్వ రంగంలోని బీఎస్ఎన్ఎల్ కూడా మినహాయింపేమీ కాదు. రిలయన్స్ జియో షేక్ చేసేసిన ముఖేశ్.. ఇప్పుడు మరో కీలక రంగంపై కన్నేసినట్లు తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం క్యాబ్ సర్వీసుల రంగం అభివృధి చేందుతోంది.

ఈ రంగంలో దేశీయ కంపెనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మెరుగైన పనితీరు కనబరుస్తున్నఉబెర్ కూడా ఉంది. ప్రస్తుతం ఉబెర్ తనదైన శైలి దూకుడుతో ఈ రంగంలో రాణిస్తోంది. అయితే ముఖేశ్.. ఇప్పుడు ఉబెర్‍కి కూడా చుక్కలు చూపించబోతున్నాడు. విషయంలోకి వెళ్తే.. రిలయన్స్ జియో పేరిట సెల్యూలర్ ఆపరేటర్ అవతారం ఎత్తించిన ముఖేశ్ అంబానీ.. జియో క్యాబ్స్ పేరిట తన కంపెనీని ట్యాక్సీల రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా రిలయన్స్ ప్రతినిధులు ఇప్పటికే ఈ రంగంపై లోతైన పరిశోధన చేస్తున్నారు. ఇప్పటికే 600 కార్ల కొనుగోళ్ల కోసం రిలయన్స్ ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చేసిందట. ఈ ఏడాది ముగిసేలోగానే జియో క్యాబ్స్ ను రంగంలోకి తెచ్చేందుకు ముఖేశ్ పక్కా ప్లాన్ వేసుకున్నాడట. ముందుగా బెంగళూరు చెన్నై…  తర్వాత దశలో డిల్లీ ముంబై నగరాల్లోనూ జియో క్యాబ్స్ అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం.  కీలోమీటరు కేవలం 5 రూపాయల చొప్పున ఈ సర్వీస్ ఉంటుందట. నెట్వర్కింగ్లో సంచలనం రేపిన ముఖేశ్… ఇక క్యాబ్స్ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలి.

{youtube}i_QLagbogGk{/youtube}

Related

  1. ప్రభుత్వానికి దిమ్మతిరిగే దెబ్బ కొట్టిన జియో .. ఎంత నష్టమో తెలుసా..?
  2. షాకింగ్ : జియో సిమ్ లతో భారీ మోసం.. బయట పెట్టిన పోలీసులు
  3. జియో వల్ల వారికి ఎంత లాభమో తెలిస్తే షాకే!
  4. జియో, ఎయిర్‌టెల్, టెలినార్‌, ఐడియా.. అన్ని ఫ్రీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -