Sunday, April 28, 2024
- Advertisement -

షాకింగ్ : జియో సిమ్ లతో భారీ మోసం.. బయట పెట్టిన పోలీసులు

- Advertisement -
jio sim cards scham six members arrested

ఉచిత డేటా.. ఉచిత వాయిస్ కాల్స్ తో సంచలనం సృష్టించింది జియో. అయితే జియో సిమ్ లేని వారికి ఫ్రీ గా సిమ్ లను ఇస్తున్నారు. అయితే ఇదే అదునుగా తీసుకున్నారు కొందరూ కేటుగాళ్లు. సిమ్ కార్డులను డబ్బులకు విక్రయిస్తున్న ఆరుమంది కేటుగాళ్లును ఇండోర్ పోలీసులు అరెస్టు చేశారు. రిలయన్స్ జియో సిమ్ కస్టమర్‍కు ఇచ్చే ముందు సేల్స్ ఏజెంట్ ముందుగా ఆధార్ నంబతో పాటు కస్టమర్ వేలిముద్ర కూడా తీసుకుంటారు. ఇక్కడే కొందరూ కేటుగాళ్లు మోసానికి పాల్పడుతున్నారు.

వేలిముద్రలు తీసుకునే టైంలో కస్టమర్‍తో రెండు సార్లు వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఒక వేలిముద్ర పై ఒక సిమ్ కార్డు ఇస్తారు. మరో వేలిముద్రతో రెండో సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసి ఇతరులకు ఎలాంటి డాక్యుమెంట్స్  లేకుండానే రూ.100 నుంచి రూ.1000 వరకు  అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ స్కామ్ ను బయట పెట్టి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు ఇండోర్ పోలీసులు.

వారి నుంచి 346 సిమ్ కార్డ్‌లను స్వాదీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సిమ్ కార్డులతో ఏమైన చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తుస్తున్నారు. జియో సిమ్ తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. రెండుసార్లు వేలిముద్రలు వేయించుకుంటుంటే అనుమానించాల్సిన అవసరం ఉందని.. ప్రశ్నించని తెలిపారు. రెండో సిమ్ కార్డ్ మీ పేరుపై సంఘవిద్రోహ కార్యక్రమాలకు పాల్పడితే.. చిక్కుల్లో పడే అవకాశం ఉందని.. సిమ్ తీసుకునే ముందు నిబంధనలు పాటించాలని పోలీసులు సలహా ఇస్తున్నారు. 

Related

  1. ఇలాంటి ఆఫర్ మరోకటి ఉండదు.. సూపర్ ఆఫర్ ఇచ్చిన జియో
  2. మీకు రిలయన్స్ జియో sim కావాలా ?
  3. జియో వల్ల వారికి ఎంత లాభమో తెలిస్తే షాకే!
  4. జియో, ఎయిర్‌టెల్, టెలినార్‌, ఐడియా.. అన్ని ఫ్రీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -