Sunday, April 28, 2024
- Advertisement -

ఈ సారి ఎన్నికలకి ఈ-వాచ్‌ యాప్‌..!

- Advertisement -

ఈ-వాచ్‌ యాప్‌ను ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఆవిష్కరించారు. విజయవాడలోని ఎస్​ఈసీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ యాప్‌తో.. ఎస్​ఈసీకి నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నామని నిమ్మగడ్డ చెప్పారు. ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాలపై ఫిర్యాదుల స్వీకరణకు యాప్‌ను రూపొందించినట్లు వివరించారు.

వ్యవస్థలో పారదర్శకత కోసమే సాంకేతిక వినియోగమని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. మిగిలిన యాప్‌లపై ఎలాంటి అపనమ్మకం లేదని స్పష్టం చేశారు. రిలయన్స్ జియో సహకారంతో యాప్ తయారుచేశామన్న ఎస్‌ఈసీ.. బయటి వ్యక్తులెవరినీ పర్యవేక్షణకు తీసుకోవట్లేదన్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును కచ్చితంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. సమస్యపై చర్యలను ఫిర్యాదుదారులకు తెలియజేస్తామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -