Wednesday, May 15, 2024
- Advertisement -

రోజాకు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్న సీఎం జ‌గ‌న్

- Advertisement -

జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌ని వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా జాక్ పాట్ కొట్టింది. పార్టీని న‌మ్ముకున్నందుకు జ‌గ‌న్ న్యాయం చేశారు. నిజానికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చాలా ఆశలు పెట్టుకున్న రోజా.. అలా జరగకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు.మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి కూడా దూరంగా ఉన్నారు. కొన్ని రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల వ‌ల్ల రోజాకు జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు.

జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో అసంతృప్తిగా ఉన్న రోజా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు. రోజా అసతృప్తిని గ‌మ‌నించిన జ‌గ‌న్ నామినేటెడ్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమించారు. అందులో భాగంగానే తాజాగా ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నయమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తొలి నుండి పార్టీలో ఉన్న రోజాకు కీల‌క ప‌ద‌వి ఇస్తామ‌న్న హామీని జగన్ నిలబెట్టుకున్నారు. జ‌గ‌న్ టీంలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రోజా… 2014, 2019 ఎన్నిక‌ల్లో న‌గ‌రి నుండి గెలుపొందారు.

ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా రోజా నియమితులు కావడం పట్ల చిత్తూరు జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పారిశ్రామిక రంగం డెవలప్ అవుతుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సత్యవేడు శ్రీసిటీ ఉంది. ఇప్పుడు ఏపీఐఐసీ తరఫున పారిశ్రామిక క్లస్టర్లు మరిన్ని ఏర్పాటయ్యే అవకాశం ఉందని… జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -