Saturday, May 18, 2024
- Advertisement -

దేశ అధ్యక్షుడిని అవమానించిన టీటీడీ

- Advertisement -

ఒక్కొక్క సారి అధికారుల సమన్వయ లోపం వల్ల యావత్ సంస్థ అభాసు పాలు అవుతుంది. ఇప్పుడు తిరుమల తిరపతి దేవస్థానం కి కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురు అయ్యింది. ఏకంగా దేశ అధ్యక్షుడికి దక్కాల్సిన గౌరవం విషయం లో ఇబ్బడి అయ్యింది.  

కారు డ్రైవర్ కోసం సిరిసేన ఏకంగా పదినిమిషాలపాటు వేచి చూడాల్సి వచ్చింది. అధికారులు చూపిన ఈ అలసత్వంపై భక్తులు సైతం మండిపడుతున్నారు. కలియుగం దైవం వెంకన్నను దర్శించుకునేందుకు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ముందు రోజే తిరుమలకు చేరుకున్నారు. కుటుంసభ్యులతో  సహా ఆయన దర్శనం కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న మైత్రిపాల ఆలయం బయటకు వచ్చారు. కానీ అక్కడ డ్రైవర్ లేకపోవడంతో కారులోనే మైత్రిపాల కూర్చొవాల్సి వచ్చింది. ఇలా పది నిమిషాల పాటు కూర్చొన్నారు. ఆయన దర్శనం కోసం ఏర్పాట్లు చేసిన అధికారులు దేశధ్యక్షుడి సిబ్బందిని మర్చిపోయారు. దీంతో పదినిమిషాల నిరీక్షణ అనంతరం డ్రైవర్ వచ్చారు. ఈ పరిణామంపై మైత్రిపాల ఇబ్బంది పడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -