Tuesday, May 21, 2024
- Advertisement -

పశ్చిమ బెంగాల్ లో మమతానురాగం

- Advertisement -

అమ్మ గెలిచింది. దీది నిలిచింది. ఐదు రాష్ర్టాల శాసనసభ ఫలితాల్లో మహిళా నాయకురాళ్లు తమ సత్తా చాటుకున్నారు. తమిళనాడులో జయలలిత, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జి అధికారంలోకి రావడానికి కావాల్సిన స్పష్టమైన మెజార్టీ కంటే ఎక్కువ సీట్లే సాధించారు. తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ ను తలకిందులు చేస్తూ అన్నాడిఎంకె భారీగా మెజార్టీ స్ధానాలను కైవసం చేసుకున్నారు.

ఇక పశ్చిమ బెంగాల్ కూడా మమతా బెనర్జి తన పట్టు సాధించుకున్నారు. కేరళలో ఎల్ డి ఎఫ్, అస్సాంలో బిజెపి, పుదుచ్చేరిలో డిఎంకె కూటమి అధికారంలోకి రానున్నాయి. తమిళనాడులో సంప్రదాయానికి అక్కడి ఓటర్లు తిలోదకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇక్కడ ఐదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ తిరిగి అధికారంలోకి రావడం జరగదు.

తమిళనాడు ఓటర్లు ప్రతి ఏడాది తమ నిర్ణయాలను మార్చుకుంటారని రాజకీయ వర్గాల్లో కచ్చితాభిప్రాయం. అయితే దానికి విరుద్ధంగా ఇక్కడి  ఓటర్లు ఈసారి కూడా జయలలితకే పట్టం కట్టడం విశేషం. అలాగే తొలిసారిగా అస్సాంలో ఓటర్లు కాంగ్రెస్ ను కాదని బిజెపికి పట్టం కట్టారు. ఈ విజయం ప్రధాని నరేంద్ర మోదీకి కాసింత ఊరట కలిగించే అంశం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -