Friday, April 26, 2024
- Advertisement -

ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. కేంద్రమంత్రి పదవి..లక్​అంటే ఈయనదే..!

- Advertisement -

మనదేశ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తులు ముఖ్యమంత్రులు అవుతారు. అవసరమైతే కేంద్ర మంత్రులు కూడా అవుతారు. రాజ్యాంగం ఇందుకు అనేక వెసులుబాట్లు కల్పించింది. సాధారణంగా ప్రధాని ఆయా శాఖలకు సమర్థులైన వ్యక్తులకు కేంద్ర మంత్రుపదవులు ఇవ్వాల్సి ఉంటుంది. మంత్రుల ఎంపిక, శాఖల మార్పు ఇదంతా ప్రధాని అధికారాల్లో భాగమే. అయినప్పటికీ మనదేశంలోని రాజకీయపార్టీలన్నీ కేవలం ఎన్నికల మేనేజ్​మెంట్​ను దృష్టిలో ఉంచుకొని మాత్రమే పదవులు ఇస్తుంటాయి.

నిన్న కేంద్ర క్యాబినెట్​ పునర్వ్యస్థీకరణ జరిగిన విషయం తెలిసిందే. పలువురు కొత్త వ్యక్తులకు క్యాబినెట్​లో చోటుదక్కింది. ఇంకొందరు అనూహ్యంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణాల దృష్ట్యా పలువురికి మంత్రి పదవులు దక్కాయి. ఇదిలా ఉంటే ఓ ఆసక్తికరమైన విషయం జరిగింది.. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన బీజేపీ నేతకు కేంద్ర మంత్రి పదవి దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

దక్షిణాదిన బీజేపీ చాలా వీక్​గా ఉందన్న విషయం తెలిసిందే. ఒక్క కర్ణాటకలో తప్ప.. ఎక్కడా ఆ పార్టీకి పెద్దగా బలం లేదు. దక్షిణాదిన పాగా వేసేందుకు అనేక వ్యూహాలు రచిస్తుంటారు బీజేపీ పెద్దలు. జయలలిత మరణాంతరం బీజేపీ తమిళనాడుపై దృష్టి పెట్టింది. అక్కడ ముఖ్యమంత్రి కావాలనుకున్న శశికళను జైలుకు పంపించి అక్కడి ప్రభుత్వం తమ చెప్పుచేతల్లో ఉండేలా చేసుకుంది.

ఇదిలా ఉంటే ఈ ఏడాది తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్నాడీఎంకే తో కలిసి పోటీచేసిన విషయం తెలిసిందే.
తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ అనేక వ్యూహాలు రచించింది. అందులో భాగంగానే.. సీనియర్​ న్యాయవాది, దళిత నేత అయిన ఎల్‌. మురుగన్‌ను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిని చేసింది.

ఆయన వేల్​ యాత్ర పేరుతో తమిళనాడు అంతటా పర్యటించారు. దళితులను బీజేపీ వైపు తిప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా అక్కడ అన్నాడీఎంకే–బీజేపీ కూటమి అధికారంలోకి రాలేదు. కానీ బీజేపీ నాలుగు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్నది.

తిరుపూరు జిల్లా తారాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మురుగన్‌ ఓడిపోయారు. డీఎంకే అభ్యర్థి కయల్‌వెల్లి సెల్వరాజ్‌ ఆ నియోజకవర్గంలో గెలుపొందారు. అయితే బీజేపీ అధ్యక్షుడి మీద పోటీచేసి గెలుపొందిన సెల్వరాజ్​ను సీఎం స్టాలిన్‌ మంత్రిని చేశారు. తారపురం నుంచి ఓడిపోయిన మురుగన్ కు అనూహ్యంగా నరేంద్రమోదీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.

Also Read

ప్రజల కష్ట-సుఖాలు మరోసారి స్వయంగా తెలుసుకో నున్నా జగన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -