Wednesday, May 22, 2024
- Advertisement -

ఓటుకు నోటు విషయంలో టీడీపీకి తొలి ఊరట ఇది..!

- Advertisement -

తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం ఇరుక్కుపోయాడు ఈ వ్యవహారంలో. ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వీడియోలతో సహా బుక్ అయిపోయి.. తన రాజకీయ జీవితానికే ప్రమాదాన్ని కొని తెచ్చుకొన్నాడు.

ఇంకా ఈ వ్యవహారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఆ నోటీసులే జారీ అయితే.. తెలంగాణ ఏసీబీ వారు పకడ్బందీగా కేసు పెడితే బాబు తప్పించుకోవడం కూడా కష్టం అవుతుందని తెలుస్తోంది.

మరి ఇలాంటి నేపథ్యంలో తొలిసారి తెలుగుదేశం పార్టీకి కొంత ఊరటనిచ్చే పరిణామం సంభవించింది. ఓటుకు నోటు వ్యవహారం గురించి సూటిగా స్పందించలేని తెలుగుదేశం నేతలు ఈ విషయంలో ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య హై కోర్టులు దాఖలు చేసుకొన్న పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. తనపై ఉన్న కేసులన్నీ కొట్టి వేయాలన్న అతడి పిటిసన్ ను కోర్టు స్వీకరించింది. ఈ విషయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ అభ్యంతరాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. 

ఈ ఈ పిటిషన్ ను విచారించడానికి వీల్లేదని.. అందులోనూ ఈ కేసును విచారిస్తున్న బెంచ్ ఆ పనిచేయకూడదని.. దీన్ని మరో బెంచ్ కు బదిలీ చేయాలని స్టీఫెన్ సన్ కోరాడు. అయితే కోర్టు దీనికి సమ్మతించకపోగా.. స్టీఫెన్ సన్ తీరుపై మండిపడింది. ఇది కోర్టు ధిక్కార చర్యగా భావిస్తూ అతడిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది! దీంతో ఇది తెలుగుదేశం పార్టీకి ఊరటనిచ్చే అంశం గా మారింది .తమను ఇబ్బంది పెట్టేలా ఏసీబీ చేత బుక్ చేయించిన స్టీఫెన్ సన్ ఇరుక్కోవడానికి మించి టీడీపీకి అనందాన్ని కలిగించేది ఏముంది?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -