Friday, April 26, 2024
- Advertisement -

కోర్టులో ట్రంప్ కి ఎదురు దెబ్బ..!

- Advertisement -

పెన్సిల్వేనియా ఫెడరల్​ కోర్టులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు చుక్కెదురైంది. పెన్సిల్వేనియాలో పోలైన ఓట్లను చెల్లని వాటిగా గుర్తించాలని ట్రంప్​ వేసిన దావాను ఫెడరల్​ న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ట్రంప్​ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ మాథ్యూ బ్రాన్​ ధర్మాసనం.. ​ పెన్సిల్వేనియాలో ఏ ఒక్క ఓటును వృథాగా పోనివ్వబోమని వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ట్రంప్​ వాదనను కొట్టి పారేసింది. ట్రంప్​ వర్గం నుంచి తనకు బెదిరింపు కాల్స్​ వచ్చాయని ఇటీవల జస్టిస్​ మాథ్యూ అన్నారు.

పెన్సిల్వేనియా కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ట్రంప్​ తరఫు న్యాయవాదులు. విచారణలో తమకు ఆధారాలు సమర్పించే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. పెన్సిల్వేనియా తీర్పును సవాల్​ చేస్తూ తాము సుప్రీం కోర్టుకు వెళతామని పేర్కొన్నారు. ఒబామా నియమించిన ప్రధాన న్యాయమూర్తి ఈ విషయంలో ఇంత త్వరగా నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

లైంగిక సామర్థ్యం లో క్రూరత్వం..!

కరోనా వాక్సిన్ పై.. వైట్ హౌస్ కొత్త ప్రకటన..!

చైనా పై గురి పెట్టిన బైడెన్ ..!

బరాక్ ఒబామా స్వీయ అనుభవాలకి భారీ స్పందన..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -