Wednesday, May 22, 2024
- Advertisement -

అవిశ్వాస తీర్మానంపై బాబు యూట‌ర్న్‌…ఎన్డీఏనుంచి బ‌య‌ట‌కు రానున్న టీడీపీ..?

- Advertisement -

చంద్ర‌బాబు నాయుడు మ‌రో సారి లీకుల నాటాకానికి తెర‌లేపారు. నిన్న‌టి వ‌ర‌కు వైసీపీ పెట్టే అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని చెప్పి ఇప్పుడు మాట మార్చి యూట‌ర్న్ తీసుకున్నారు. ఐదు గురు ఎంపీలున్న వైసీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా సొంతంగా కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యింది.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై పొలిట్‌బ్యూరో సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వారితో చర్చించి ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎన్డీఏ నుంచి బయటకు రావాలని పొలిట్‌బ్యూరో ఏకగ్రీవంగా తీర్మానించినట్టు స‌మాచారం. బాబు చెప్పిన‌ట్లుగానే 16 మంది తెలుగుదేశం సభ్యుల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మాన నోటీసును టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహం లోక్ సభ కార్యదర్శికి కొద్దిసేపటి క్రితం అందించారు.

మ‌రో వైపు ఎన్డీఏనుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు త‌ర్జ‌నా భ‌ర్జ‌నా ప‌డుతున్నారు.శుక్రవారం సాయంత్రం పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత ఎన్డీఏతో తెగదెంపులపై అధికారికంగా ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల అంటున్నాయి.

వైసీపీ అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డానికి ప్ర‌ధానం కార‌ణం చంద్రబాబు, లోకేశ్‌పై పవన్ చేసిన వ్యాఖ్యలు వెనుక బీజేపీ హస్తం ఉన్నట్టు నమ్ముతోన్న టీడీపీ, ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ నిర్ణయంతో ఏపీలో రాజకీయాలు మరింత రసకందాయంగా మారాయి. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి ముందే ఎన్డీఏ నుంచి వైదొలగాలని టీడీపీ భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -