Monday, May 20, 2024
- Advertisement -

జిల్లాలో వైసీపీకి రోజు రోజుకి పెరిగిపోతున్న ఆద‌ర‌ణ‌…

- Advertisement -
TDP Graph is going down in West Godavari

అధికార‌పార్టీ టీడీపీకి ఎదురు వ‌న‌ణాలు వీస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌భంజ‌నం కొన‌సాగించినఅధికారంలోకి వ‌చ్చిన పార్ట ఇప్పుడు అక్క‌డ‌…చితికిల బ‌డుతోంది. నాయ‌కుల అవినీతి ధోర‌ని, ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌వైఖ‌రి క‌ల‌సి …టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ఆజిల్లా లో పొలిటిక‌ల్ సీన్ మారుతున్న సంకేతాలు వినిపిస్తున్నాయి.

గత సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఒకవిధంగా వైసీపీకి అధికారాన్ని దూరం చేసి టీడీపీకి పీఠం దక్కేలా చేసింద‌న‌డంలో సందేహంలేదు.అంతటి ఆదరణ చూపించిన జిల్లాలో పరిస్థితులపై టీడీపీ అధిష్టానం విస్మ‌రించింద‌నేఅభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ అలసత్వం.. ఇప్పుడు వైసీపీకి బూస్టింగ్ ఇస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
జిల్లాలో ఉన్న 15అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14సీట్లను టీడీపీ.. ఒక స్థానంలో తమ మిత్రపక్షం బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంది. మూడు లోక్ సభ స్థానాల్లోను రెండు స్థానాలు టీడీపీ ఖాతాలో, ఒక స్థానం బీజేపీ ఖాతాలో చేరాయి. మొత్తంగా జిల్లాలో అసలు వైసీపీ తుడిచిపెట్టుకొని పోయింద‌నే చెప్పాలి.. తిరుగులేని విజయం సాధించామన్న ధీమా.. అక్కడి టీడీపీ నేతలను గాల్లో తేలేలా చేసింది. దీంతో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ఎవరికి వారు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
పార్టీలోనే ఉన్న నాయ‌కుల మ‌ధ్య విబేధాలు.రగపర్రు గ్రామంలో దళితులపై వెలివేత విషయంలో టీడీపీ కావాల్సినంత అప్రతిష్టను మూటగట్టుకుందన్న వాదన వినిపిస్తోంది.వైసీపీ అధినేత జగన్ మాత్రం.. ధైర్యం చేసి గ్రామంలో పర్యటించారు. అటు బాధితులకు భరోసా ఇస్తూనే ఇరు వర్గాల మధ్య సయోధ్య నెలకొనేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు వర్గాల్లోను ఆయన పట్ల సానుకూల వైఖరి ఏర్పడినట్లు చెబుతున్నారు.
గంగ‌ర‌ప‌ర్రులో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు రెండు వ‌ర్గాల వారు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.దీంతో సానుకూల వాతార‌ణం క‌ల‌సివ‌స్తోంది.ఇదే స్పీడును కొనసాగిస్తూ.. జిల్లాలో తమ దూకుడును ఇలాగే కొనసాగించాలని వైసీపీ కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో టీడీపీ కంచుకోటకు వైసీపీ గండం చుట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}TjzBfDWVcks{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -