Wednesday, May 15, 2024
- Advertisement -

చంద్ర‌బాబు ఉండ‌గా జేఏసీ ఎందుకు…? టీడీపీ ఎంపీ కేశినేని నాని

- Advertisement -

టీడీపీ ప్ర‌భుత్వ తీరు విష‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ తీరు మార్చుకుంటున్నారు. ఇన్నాల్లు ప్ర‌భుత్వానికి స‌పోర్ట్ చేసిన ప‌వ‌న్ ఇప్పుడిప్పుడే ఆయ‌న‌లో మార‌పు వ‌స్తోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించగా టీడీపీ ప్రభుత్వం దానికి ఒప్పుకుందని, ఇప్పుడు ఒక్కసారిగా ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయని తీరును గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

తాజాగా కేంద్రం, రాష్ట్రం మ‌ధ్య వివాదం నెల‌కొన్న అంశాల‌ను విస్తృతంగా చ‌ర్చించాల్సిన అవసరం ఉందని, విభ‌జ‌న హామీల‌కు సంబంధించి జేఏసీని ఏర్పాటు చేయాల‌ని ప‌వ‌న్ తెలిపారు. ఇప్ప‌టికే జేపీతో చ‌ర్చ‌లు జ‌రిపిన ప‌వ‌న్ త్వ‌ర‌లో ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌ను క‌ల‌వ‌నున్నారు. మేధావులంద‌రితో చ‌ర్చించి జేఏసీ ఏర్పాటుపై నిర్ణ‌యం తీసుకోనున్నారు.

ప‌వ‌న్ ఏర్పాటు చేయ‌నున్న జేఏసీపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. చంద్రబాబు సీఎంగా ఉండగా జేఏసీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరమేలేదని చెప్పారు. ఆర్థికవేత్త‌లు, ప్ర‌భుత్వ మాజీ అధికారులు, విద్యా వేత్త‌లు, సామాజిక, రాజ‌కీయ నాయ‌కులు తదిత‌రుల‌తో జేఎఫ్‌సీని ఏర్పాటు చేయాలని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -