Wednesday, May 15, 2024
- Advertisement -

పని ఒత్తిడితో సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

- Advertisement -

సాప్ట్‌వేర్ ఉద్యోగం అంటే కొంత మందికి నరకంగా మారింది. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.

ఈ కోణంలోనే తాజాగా పనిఒత్తిడి తాళలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటణ హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. శ్రీరాం రాజారం అనే టెకీ ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ మాదాపూర్‌కు చెందిన ఒక ఐటీ సంస్థలో డెవలప్‌మెంట్ విభాగంలో పని చేస్తున్నాడు. పని ఒత్తిడి కారణంతో కొంత కాలం నుంచి డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం అనంతగిరికి వెళ్ళిన రాజారాం హరితా రిసార్ట్‌లో రూం నెంబర్ 303 తీసుకున్నాడు. చనిపోయే కొద్ది సమయం ముందు తన సంస్థ ఉన్నతాధికారికి మెయిల్ పెట్టి, అనంతరం అదే రూంలో ఫ్యాన్‌‍కు ఉరివేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసును నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -