Friday, May 17, 2024
- Advertisement -

విశాలమైన గదులు.. వనాల మధ్య కలక్టరేట్లు

- Advertisement -

పెద్ద పెద్ద భవనాలు.. అది కూడా 25 ఎకరాల విస్తీర్ణంలో 2.5 లక్షల చదరపు అడుగులో నిర్మించనున్న ఆకాశహార్మాన్లు. ఆ భవంతుల్లో పచ్చదనం. పూల మెక్కలు… లతలు.. ఓ చిన్న ఉద్యానవనాన్ని పోలిన చందంగా ఏర్పాట్లు. ఇవన్నీ ఎక్కడనుకుంటున్నారా. ఇంకెక్కడ… తెలంగాణలో కొత్తగా ఏర్పడనున్న 15 జిల్లాల కలక్టరేట్ల భవనాల నమూనా.

రెండు రోజుల క్రితం కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి తాజాగా ఆ జిల్లాల్లో కలక్టరేట్లు ఎలా ఉండాలనే దానిపై అధికారులతో చర్చించారు. ప్రజల కోసం నిరంతరం పని చేసే కలెక్టర్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో పని చేయాలని, ఆఫీసుకు రావాలంటే ఉసూరుమనకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అభిప్రాయపడ్డారు.

అందుకు తగ్గట్టుగానే కలెక్టరేట్లు ఉండాలని ఆర్కిటెక్ట్ లకు సూచించారు. కొత్త కలెక్టరేట్లు స్టేట్‌ఆఫ్‌ది ఆర్ట్‌గా  ఉండాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన కార్యాలయాలన్నీ కూడా కలెక్టరేట్ లోనే ఉండాలని, దీని వల్ల ప్రజలు అక్కడికి ఇక్కడికి తిరిగే బాధ తప్పుతుందని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా దాదాపు 30 శాఖల కార్యాలయాలు ఇక్కడ ఉండేలా బిల్డింగ్ ప్లాన్ ఉండాలన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -