Sunday, May 19, 2024
- Advertisement -

తెలంగాణా పోలీస్ కి బాబు వలన తలనొప్పి

- Advertisement -

శాంతి భద్రతల బాధ్యత ఎప్పుడూ పోలీసు యంత్రాంగానిదే. రెండు రాష్ట్రాలకీ చాలా ముఖ్యమైన అసంబ్లీ బడ్జెట్ విషయం లో హైదరాబాద్ పోలీసులకి ఇప్పుడు కీలక సవాలు ఎదురు అవ్వబోతోంది.

పైగా ఈ సవాలు ఎదురు అయ్యేది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వలన అవడం మరింత రంజుగా మారింది. ఈ నెలాఖరు లోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ తమ తమ బడ్జెట్ లని ఆమోదించుకోవడం తప్పనిసరి విషయం . లేదంటే ప్రభుత్వ ఉద్యోగుగల్ జీతాలు అన్నీ ఆగిపోతాయి, కొత్త కొత్త ఇబ్బందులు ఒస్తాయి కూడా, రెండు రాష్ట్రాలూ బడ్జెట్ లని ప్రవేశ పెట్టడానికి డేట్ లు ఇచ్చేసాయి. ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభం కానుండగా 10న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. 

 రెండూ కూడా హైదరాబద్ లోని అసంబ్లీ  లోనే జరగాల్సి ఉంది. ఏపీ అసంబ్లీ సమావేశాలని తాత్కాలిక రాజధాని విజయవాడ లో చేస్తాం అన్నారు కానీ అది కుదరకపోవడం తో హైదరాబద్ ఒస్తున్నారు. రెండు వేరు వేరు భవనాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకీ ఉన్నా కూడా ఆవరణ చాలా చిన్నది అవ్వడమే ఇక్కడ అసలు ఇబ్బంది. ఇద్దరు ముఖ్యమంత్రుల భారీ కాన్వాయ్ లు నలుగురు ఉపముఖ్యమంత్రుల కాన్వాయ్ తో పాటు మంత్రులు – ఎమ్మెల్యేల వాహనాలతో శాసనసభా ప్రాంగణం కిక్కిరిసిపోనుంది. ఇది పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారనుంది. సిటీ లో కూడా ట్రాఫిక్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురు కోవాల్సి ఉంటంది.  ఎమ్మెల్యేలకోసం ట్రాఫిక్ పర్యవేక్షణ పోలీసులకు తలకుమించిన భారంగా మారనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -