Monday, May 6, 2024
- Advertisement -

ఎన్నికల కోడ్..తొలిరోజు 18 కోట్లు సీజ్..మీరూ జాగ్రత్త!

- Advertisement -

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తొలిరోజే రూ.18 కోట్లు సీజ్ చేశారు పోలీసులు. నగదు, మద్యం, బంగారం, డ్రగ్స్ కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా 148 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా నార్సింగిలో కారులో తరలిస్తున్న రూ.88 లక్షలకు ఎలాంటి అనుమతి పత్రాలు లేవని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బషీర్‌బాగ్‌లో పోలీసులు తనిఖీలో 16 కిలోల బంగారంతో పాటు 300 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. చందానగర్‌లో 6 కేజీల బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఎంత డబ్బు పట్టుకెళ్లాలి..వాటికి సంబంధించిన విధివిదానాలపై ప్రజలు తీవ్రంగా చర్చిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం రూ.50 వేల వరకే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకు మించి డబ్బు, బంగారం ఉంటే దానికి సంబంధించిన సరైన పత్రాలు చూపించాలి. లేకుంటే వాటిని సీజ్‌ చేసే అవకాశం ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆధారాలు చూపిస్తేనే వాటిని తిరిగి ఇస్తారు.

అందుకే అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, శుభకార్యాలు, ఇతర అవసరాలకు అధిక మొత్తంగా నగదు తీసుకెళ్లేవారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే దీనిపై అవగాహన తప్పనిసరి. ముఖ్యంగా ఏదైనా అవసరాల కోసం బ్యాంకు నుంచి నగదు డ్రా చేస్తే..బ్యాంక్ పాస్ బుక్ లేదా ఏటీఎం స్లిప్‌ దగ్గరపెట్టుకోవాల్సిందే. భూమి విక్రయించిన డబ్బు అయితే వాటికి దస్తావేజులు చూపాలి. ఏ మాత్రం పొరపాటు చేసిన ఎన్నికలు ముగిసే వరకు ఆ డబ్బు తిరిగి ఇవ్వరు. అప్పుడు కూడా సరైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సో ప్రజలారా బీ కేర్ ఫుల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -