Saturday, April 20, 2024
- Advertisement -

ఒట్టు తీసి గట్టు మీద పెట్టిన బాబు..!

- Advertisement -

రాజకీయ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఒక్కోసారి ఈ విమర్శలు తారస్థాయికి చేరి వివాదాలకు తెరతీస్తాయి. ఆ విధంగా చెలరేగిన వివాదాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. అలా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంఘటనలలో ఏపీ ప్రఃతిపక్ష నేత చంద్రబాబు నాయిడు అసెంబ్లీ సాక్షిగా కంటతడి పెట్టిన సంఘటన కూడా ఒకటి. ఏపీలో సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న చంద్రబాబు..తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసినప్పటికి 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి చంద్రబాబును తీవ్ర స్థాయిలో నిరాశపరిచింది. ఆ తరువాత ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో వాద ప్రతివాదనలు చేస్తూ వచ్చారు. .

అయితే గత ఏడాది నవంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు సతీమణి పై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురై..తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని.. అతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టబోనని శపథం చేశాడు. ఇక అప్పటినుంచి ఇప్పటి వరకు చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు.. అయితే తాజాగా జూలై 18 జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టాల్సివచ్చింది. ఇలా చంద్రబాబు అసెంబ్లీకి రావడంపై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ ” సి‌ఎం అయ్యే దాకా అసలు అసెంబ్లీ గడపతొక్కనని మంగమ్మ శపథం చేశాడు. ఆ ఒట్టు తీసి కరకట్ట గట్టున పెట్టేసి అసెంబ్లీకి వెళ్ళి ఓటు వేశాడు బాబు.. ఇక సి‌ఎం కాలేననే క్లారిటీ ఆయనకు ఉన్నట్లుంది.. ” అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.

అయితే చంద్రబాబు చేసిన శపథం వాస్తవమే అయినప్పటికి.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేసేందుకు అసెంబ్లీకి వెళ్లకతప్పని పరిస్థితి. ఇలా చంద్రబాబు మాట తప్పడంతో చంద్రబాబు శపథం చేసిన విడియోలతో పాటు ఓటు వేసేందుకు అసెంబ్లీకి వచ్చిన విడియోలను జత చేసి వైసీపీ వారు వైరల్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు తన మాటకు కట్టుబటి..అసెంబ్లీకి వెళ్లకుండా తన రాష్ట్రపతి ఎన్నికలను సైతం పక్కన పెట్టేసి ఉంటే ఆయన భీష్మ పట్టుదల రుజువైండేది. కానీ చంద్రబాబు అలా చేయకుండా తన రాజకీయ లబ్ది కోసం ఎన్డీయే తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న ద్రౌపది ముర్ము కు మద్దతు పలకడం.. అలాగే ఓటు వేసేందుకు మాట తప్పి అసెంబ్లీకి వెళ్ళడం ఇవన్నీ కూడా ఆయనపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

విస్తరిస్తోన్న ఆప్.. సౌత్ లో పాగా వేసేనా ?

జగన్ అప్పులు.. రాష్ట్రం తిప్పలు !

జగన్ నయా ప్లాన్ ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -