Sunday, May 19, 2024
- Advertisement -

వరంగల్ ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈ పరీక్షలకు 5 లక్షల 55 వేల 265 మంది విద్యార్ధులు హాజరయ్యారు.

వీరిలో  85.63 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 84.70 శాతం మంది ఉత్తీర్ణులవగా, బాలికలు 86.57 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు. ఇక జిల్లాల వారీగా చూస్తే వరంగల్ జిల్లా 95.13 శాతంతో ఫలితాల్లో ప్రథమస్ధానం సాధించింది. చివరి స్ధానంలో 76.23 శాతంతో హైదరాబాద్ నిలిచింది. తెలంగాణలోని పది పాఠశాలల్లో ఒక్క విద్యార్ధి కూడా ఉత్తీర్ణత సాధించకపోవడం గమనార్హం. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -